ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ బిగ్ బాస్ హోస్ లో మూడో రోజు మొదలైపోయింది. రెండు రోజులు నామినేషన్స్ తో వేడెక్కిన హోస్ మూడో రోజు కాస్త కూల్ గా మొదలైంది. కింగ్ విషయంలో ప్రిన్స్ కు అలానే షకీలాకు కాస్త మనస్పర్థలు రాగా ఇద్దరూ మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఇక హౌస్ అంతా సైలెంట్ గా ఉన్న సమయంలో మొదటి వారం మొదటి టాస్క్ తో వచ్చేశాడు బిగ్ బాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ టాస్క్
ఈసీజన్ మొదటినుండీ ఉల్టా పల్టా అంటూ కాస్త విభిన్నంగా ఉండబోతుంది అన్నట్టు హింట్ అయితే ఇస్తూనే వచ్చారు. మరోసారి కంటెస్టెంట్ లకు ఆ విషయాన్ని గుర్తుచేశాడు బిగ్ బాస్. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంతా ఉల్టా పల్టా ఉంటుందని ఇప్పటికే అర్థమయిఉంటుంది అనుకుంటున్నాను.. మీరు ఇప్పటికీ ఇంటి సభ్యులు కాదు.. కేవలం కంటెస్టెంటులు మాత్రమే అంటూ తెలుపుతూ ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో గెలిచిన వాళ్లకు హౌస్ లో కన్ఫమేషన్ తో పాటు ఇమ్యూనిటీ కూడా వస్తుందని చెప్పాడు.
ఫేస్ ది బీస్ట్
టాస్క్ ఏంటంటే.. ఫేస్ ది బీస్ట్ అంటే ఇద్దరు బాడీ బిల్డర్స్ తో కంటెస్టెంట్స్ పోటీపడాలి. ఒక రింగ్‍లో బజర్ మోగినప్పటి నుంచి ఎంత ఎక్కువ సమయం వరకు ఎవరు ఉంటారో వారు విజేతలు. రింగ్ నుంచి కాలు బయట పెట్టినవారు ఔట్ అవుతారు. ఇక 14 మంది ఈ పోటీలో పాల్గొంటారు. ఈ పోటీ కూడా కాస్త సీరియస్ గా అదే విధంగా కాస్త జోవియల్ గా జరిగింది. తమ కండబలాన్ని.. బుద్ది బలాన్ని వాడి పోటీలో పాల్గొన్నారు కంటెస్టెంట్లు. ఇక ఈ టాస్క్ లో శోభా శెట్టి, అమర్ దీప్, షకీల, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, ఆట సందీప్ బాగా ఆడి ఎక్కువ సేపు రింగ్ లో ఉండగలిగారు.
ఇక టాస్క్ అయిపోయిన తరువాత తాను గెలుస్తానో లెదో అని కంటతడి పెట్టుకున్నాడు ఆట సందీప్. అనంతరం బిగ్ బాస్ ఫలితాలని తెలియచేశాడు. 1 నిమిషం 49 సెకన్లతో ఆట సందీప్ అందరికంటే ఎక్కువ సేపు ఉండి విన్నర్ అయ్యాడు. ఇక అమ్మాయిల నుంచి 1 నిమిషం 3 సెకన్లతో ప్రియాంక జైన్ గెలిచింది.
టాస్క్ అనంతరం అయితే 1 నిమిషం 46 తేడాతో అంటే కేవలం మూడు సెకన్ల తేడా వల్ల పల్లవి ప్రశాంత్ గెలుపుకు దూరమయ్యాడు. దీంతో అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తనను తేజ మోటివేషన్ తో ఓదార్చాడు. మరోవైపు శివాజీ ప్రశాంత్ ఆటను ప్రశంసించాడు. అంతేకాదు తాను చాలా మంచి ప్లేయర్ అని.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడని కూడా చెప్పుకొచ్చాడు. గౌతమ్ కృష్ణ ఒంటరిగా కూర్చొని ఎవరిని నమ్మేది లేదు.. ఎవరికీ వినేది లేదు అంటూ తనలో తాను చెప్పుకున్నాడు. దీంతో మూడో రోజు ముగుస్తుంది.
మరి టాస్క్ లో గెలుపొంది ఆట సందీప్ అలానే ప్రియాంక నెక్ట్స్ లెవల్ కు అర్హతను పొందారు. మరి నెక్ట్స్ టాస్క్ వీరిద్దరికే ఉంటుందా.. ఉల్టా పల్టా కాబట్టి బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.