శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఈక్రేజీ కాంబినేషన్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈసినిమా పాటలు సినిమాపై హైప్ ను మరింత పెంచేశాయి. ఇక రిలీజ్ అయిన తరువాత కూడా వీరిద్దరి కెమిస్ట్రీకే మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక లవ్, కామెడీ, ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అందరినీ ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లను రాబట్టుకుంటుంది. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో దాదాపు 70 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టగా.. తమిళ్ లో అయితే కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటుంది. తమిళ్ లో ఈసినిమా ఇప్పటివరకూ 7 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అంతేకాదు 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.
குஷி at the box office ❤️#BlockbusterKushi is the highest grossing movie from TFI in Tamil Nadu this year with 7 CRORES and going super strong ❤🔥
Book your tickets for the BLOCKBUSTER FAMILY ENTERTAINER #Kushi now!
– https://t.co/16jRp6TSRW@TheDeverakonda @Samanthaprabhu2… pic.twitter.com/frBhxlBkGk— Mythri Movie Makers (@MythriOfficial) September 6, 2023
ఇక ఖుషి సినిమా కథ విషయానికి వస్తే అబ్బాయి ఫ్యామిలీ నాస్తిక కుటుంబానికి చెందింది.. అమ్మాయి ఫ్యామిలీ ఆచారాలు, సంప్రదాయాలకు నిదర్శనమైంది. అలాంటి కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు.. వారి ప్రేమను కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారు అన్న పాయింట్ తో ఈసినిమాను రూపొందించాడు శివ నిర్వాణ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: