ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. బింబిసార సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అంటూ వచ్చాడు. అయితే ఆసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు డెవిల్ అంటూ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈసినిమాను నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. నవంబర్ 14వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఆమేరకు పనులను ముగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పూజా కార్యక్రమాలతో ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు అప్ డేట్ ఇచ్చారు.
The dubbing for #DevilBritishSecretAgent has officially kicked off, and we couldn’t be more excited! @NANDAMURIKALYAN is all set to enthrall us as a British secret agent. Get ready for an edge-of-your-seat experience! 🕵️♂️🔥 #DubbingInProgress #Devil @iamsamyuktha_ @soundar16… pic.twitter.com/x5Il138OPj
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 6, 2023
కాగా 1940 బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: