‘జవాన్’ పై మహేష్ ట్వీట్.. షారుఖ్ రియాక్షన్ ఇదే..!

Shah Rukh Khan Reply To Mahesh Babu's Tweet on Jawan

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఈ యేడాది ఆరంభంలో ‘పఠాన్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన ‘జవాన్‌’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రేపు హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్‌ అవుతోంది. ఈ క్రమంలో జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ పండితులు సైతం షాకవుతున్నారు. ఎందుకంటే ఒక్క బుక్‌ మై షో యాప్‌ లోనే కోటికి పైగా టిక్కెట్‌లు అమ్ముడయ్యాయంటే.. షారుఖ్ ఖాన్ స్టామినా ఏంటో అర్ధమవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ‘జవాన్‌’ సినిమా విడుదల సందర్భంగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘జవాన్’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ‘ఎక్స్’ (ట్విట్టర్‌) వేదికగా ‘ఇట్స్ టైమ్ ఫర్ జవాన్.. షారుఖ్ ఖాన్ పవర్ మొత్తం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుంది. ఈ సినిమా అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నా.. అంటూ ట్వీట్‌ చేశారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సైతం జవాన్‌ సినిమాకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచగా.. మహేష్ ట్వీట్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్‌ అయింది.

అయితే మహేష్ బాబు ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ స్పందించారు. ఆయన కూడా ట్విటర్‌లో బదులిస్తూ.. ‘మహేష్‌ బాబుకు థ్యాంక్యూ. మీరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి. మీతో పాటు కలిసి నేను కూడా సినిమా చూస్తాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా లవ్’ అని రిప్లై ఇచ్చారు. ఇలా అగ్ర హీరోలు ఇద్దరూ ఒకరికొకరు ట్వీట్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. కాగా జవాన్‌ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ.. షారుఖ్ తాజాగా తన కూతురు సుహానాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. జవాన్ సినిమాను రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్‌ నిర్మించడం గమనార్హం.

ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ముందుగా మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.