బిగ్ బాస్ 7- నామినేషన్స్ తో మొదలైన రచ్చ

Bigg Boss 7 First Week Nominations Contestants List

ఫైనల్ గా బుల్లితెర ప్రేక్షకులు.. బిగ్ బాస్ లవర్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయిపోయింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో 14మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సీజన్ అలా మొదలైందోో లేదో మొదటిరోజు నుండే కొంతంమంది కంటెస్టెంట్ ల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టానికి తెరతీశాడు బిగ్ బాస్. నామినేషన్స్ ప్రక్రియను మొదలుపెట్టేశాడు. అయితే వచ్చిన ఒక్కరోజులోనే పెద్దగా కారణాలు కూడా ఉండవు కాబట్టి కొంతమంది కాస్త సిల్లీ రిజన్సే చెప్పుకొచ్చారు. ఆ రీజన్స్ తోనే అసలు వార్ మొదలైంది హౌస్ లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మొదటిరోజు నరకానికి స్వాగతం అంటూ నటుడు శివాజీతో నామినేషన్స్ ను మొదలుపెట్టాడు శివాజీ. అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. నామినేట్ చేసే వాళ్లను.. నామినేట్ అయిన సభ్యులు చూసే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక శివాజీ గౌతమ్ కృష్ణాను అలానే దామినిని నామినేట్ చేశాడు. ఆ తరువాత ప్రియాంక పల్లవి ప్రశాంత్, రతిక లతో ఇంకా క్లోజ్ కాలేదన్న కారణంతోో నామినేట్ చేసింది. ఇద్దరినీ నామినేట్ చేయడంతో ఫస్ట్ డే నామినేషన్స్ ముగుస్తాయి.

మొత్తానికి మొదటివారం నామినేషన్స్ ముగిసేసరికి ఎక్కువ నామినేషన్స్ శోభా శెట్టికి పడ్డాయి. ఎక్కువ మంది తను సరిగా పనిచేయడం లేదన్న కారణం చెప్పడంతో ఏడ్చేసింది. ఇక ఆతరువాత కిరణ్ రాథోడ్, రతిక ప్రిన్స్ యావర్ కు కూడా ఎక్కువ నామినేషన్సే పడ్డాయి. మొత్తానికి రెండు రోజుల్లో నామినేషన్స్ పూర్తయ్యేసరికి మొత్తం 8మంది నామినేట్ అయ్యారు. శోభా శెట్టి, రతిక, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, షకీలా, దామిని భట్ల, ప్రశాంత్ నామినేషన్ లిస్ట్ లోకి వచ్చారు.

అయితే ఉల్టా పల్టా ఉంటూ మొదలైన ఈసీజన్ ఓటింగ్ లో కూడా కాస్త మార్పులు చేశారు. గతంలో ఒక్కో కంటెస్టెంట్ కు 10 ఓట్లు వేసుకునే వీలుండేది. వేరే కంటెస్టెంట్ లకు కూడా ఓట్లు షేర్ చేసే అవకాశం ఉండేది. దీంతో మంచి కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయిన సందర్బాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా హాట్ స్టార్ ద్వారా కానీ.. మిస్డ్ కాల్ ద్వారా కానీ.. ఒక్కో కంటెస్టెంట్‌కి ఒక్క ఓటు మాత్రమే వేసుకునే అవకాశం ఇచ్చారు. మరి వీరిలో ఈ వారం ఇంటికి ఎవరు దారి పడతారో చూడాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 10 =