కళ్యాణ్ రామ్, అభిషేక్ నామా మూవీ ‘డెవిల్’ కోసం 80 భారీ సెట్స్

Kalyan Ram's Devil Movie Artwork Will Reflects 1940 Era with 80 Huge Sets

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్’. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్. స్వాతంత్య్రానికి పూర్వం ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్ ను వేశారు. ఈ సెట్స్ చూస్తుంటే ‘డెవిల్’ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘బింబిసార’ సినిమాతో ఇప్పటికే ఒక పీరియాడికల్ మూవీలో నటించి మెప్పించిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చూపబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘డెవిల్’ మూవీ కోసం 80 సెట్స్ వేయటం విశేషం. ఈ సినిమాను 1940 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. కాబట్టి దానికి తగ్గట్లు సెట్స్ ను రూపొందించారు. ఆర్ట్ డైరెక్టర్ గాంధీ ఈ చిత్రానికి సెట్స్ ను రూపొందించారు. బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్నసయమానికి చెందిన సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్ ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించారు. నిర్మాత అభిషేక్ నామాగారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్ లో భారీ సెట్ వేసి సినిమా రిచ్ గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు.

‘డెవిల్’ మూవీ కోసం వేసిన సెట్స్, వాటి విశేషాలు…

  • 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్ సెట్
  • బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు
  • బ్రిటీష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
  • 1940 కాలానికి చెందిన కార్గో షిప్
  • 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)
  • ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు.
  • అలాగే వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్ ను వినియోగించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.