కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 63

Chandramukhi 2 gets a new release date
రిలీజ్ అప్‌డేట్

చంద్రముఖి 2 విడుదల కూడా వాయిదా

ఈనెల 15న విడుదలకావాల్సిన సినిమాలు ఒక్కొక్కటి గా వాయిదాపడుతున్నాయి.అందులో భాగంగా టిల్లు స్క్వేర్ అలాగే స్కంద ఇదే డేట్ కూడా విడుదలకావల్సి ఉండగా వెనక్కి వెళ్లిపోయాయి.స్కంద ఈనెల 28న వస్తుండగా టిల్లు స్క్వేర్ నవంబర్ కు వెళ్ళిపోయింది.ఇక ఇప్పుడు ఈజాబితాలో మరో సినిమా చేరిపోయింది.అదే చంద్రముఖి 2.ఈసినిమాకూడా 15న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఈనెల 28న రిలీజ్ అవుతుంది.అనుకున్న సమయానికి సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా ఆలస్యంగా విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు.ఈసందర్భంగా న్యూ రిలీజ్ డేట్ తో కూడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
jawan day 1 collections
బాక్సాఫీస్

జవాన్ తొలి రోజే 100కోట్లు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ సృష్టించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇక తొలిరోజే 100కోట్ల వసూళ్లను రాబట్టడం షారుఖ్ కు ఇది రెండో సారి.ఇంతకుముందు షారుక్ నటించిన పఠాన్ కూడా తొలిరోజే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
SS Rajamouli Reviews Miss Shetty & Mr Polishetty and Jawan
సినిమా వార్తలు

ఆ రెండు సినిమాలపై రాజమౌళి రివ్యూ.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం రాజమౌళి పేరుని చెప్పగానే గుర్తుపడతారంటేనే.. అర్ధమవుతోంది ఆయన ఎంత ఫేమస్ అయ్యారో. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ట్రెజర్ హంట్, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే తాజాగా రాజమౌళి ఇటీవలే విడుదలైన రెండు సినిమాలను వీక్షించారు. అంతేకాకుండా.. ఆ రెండు…

Srikanth Mవాట్సాప్
chandramukhi 2 movie pre release event date and venue locked
సినిమా వార్తలు

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Mark Antony Movie Completed All Censor Formalities
సినిమా వార్తలు

మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

కోలీవుడ్ హీరో విశాల్‌కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

Srikanth Mవాట్సాప్
tamil director and actor marimuthu passed away
సినిమా వార్తలు

ప్రముఖ తమిళ నటుడు మరిముత్తు మృతి

ఈమధ్య కాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే కదా. ఎంతోమంది లెజెండరీ నటీనటులను పలు ఇండస్ట్రీలు కోల్పోయాయి. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన మరిముత్తు నేడు హఠాన్మరణం చెందారు. మరిముత్తు ప్రస్తుతం ఎథిర్ నీచల్ అనే పేరుతో టెలివిజన్ లో ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈ షో డబ్బింగ్ నిమిత్తం స్టూడియోకు వెళ్లారు. ఇక అక్కడ డబ్బింగ్ చెబుతున్న సమయంలో సడెన్ గా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. హాస్పిటల్ కు తీసుకెళ్లే మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తంది. ఇక మరిముత్తు మరణం తమిళ్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి…

TFN Adminవాట్సాప్
rashmika mandanna shares interesting photo from pushpa 2 movie set
సినిమా వార్తలు

పుష్ప2 సెట్ నుండి రష్మిక ఫొటో

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే కదా. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Reviews Shah Rukh Khan's Jawan Movie
సినిమా వార్తలు

జవాన్ మూవీపై మహేష్ మళ్ళీ ట్వీట్.. ఈసారి ఓ రేంజ్‌లో

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జవాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ అర్ధమయింది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని…

Srikanth Mవాట్సాప్
miss shetty mr polishetty biggest usa opening
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బిగ్గెస్ట్ యూఎస్ఏ ఓపెనింగ్

ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన కాంబినేషన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా, నవీన్ పోలిశెట్టి హీరోగా ఈసినిమా వచ్చింది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫైనల్ గా భారీ అంచనాలతో ఈసినిమా రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

TFN Adminవాట్సాప్
mahesh babus srimanthudu movie create new records in tollywood
సినిమా వార్తలు

8 ఏళ్లు అయినా శ్రీమంతుడు కొత్త రికార్డులు

కొన్ని సినిమాలు రిలీజ్ అయి ఎన్నేళ్లయినా కూడా ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ రిపీట్ గా చూస్తునే ఉంటారు. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. యూట్యూబ్ లు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వచ్చిన తరువాత ఏ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేయొచ్చు. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయి 8 ఏళ్లు అయిపోతున్నా ఇంకా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న శ్రీమంతుడు.

TFN Adminవాట్సాప్
skanda run time revealed
సినిమా వార్తలు

స్కంద రన్ టైం రివీల్

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద మరో 20రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ముందు ఈసినిమాను ఈనెల 15న విడుదలచేయాలనుకున్నారు కానీ ఇంకాస్త ఎక్కువ టైం తీసుకొని ఈనెల 28న దింపుతున్నారు.ఇక ఈసినిమా ట్రైలర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.యూట్యూబ్ లో ఏకంగా 50మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టింది దాంతో సినిమా కూడా దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఇదిలావుంటే ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.స్కందకు రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే వుంది.2గంటల 47నిమిషాల నిడివితో రానుంది.

Mahender Reddyవాట్సాప్
Rules Ranjann movie trailer out now
ట్రైలర్ & టీజర్

రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఈరేంజ్ లో అవకాశాలు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కిరణ్ మాత్రం ఆ విషయంలో లక్కీ అనే చెప్పొచ్చు. జయాపజయాలతో సంబంధం లేకుండా కిరణ్ కు పెద్ద పెద్ద బ్యానర్లలోనే అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Skanda Trailer Rage Hits Over 50 Million Views on YouTube
ట్రైలర్ & టీజర్

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'స్కంద' ట్రైలర్

టాలీవుడ్‌లో మాస్ మసాలా యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు ఉస్తాద్ రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న కొత్త చిత్రం 'స్కంద'. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్ కు విశేష స్పందన…

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

కంగన పై జ్యోతిక ప్రశంసలు- పెద్ద అభిమానిని

పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చంద్రముఖి 2. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఈసినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
arjun das interesting comments about og voice over
సినిమా వార్తలు

OG- ఇంకా బాగా ట్రై చేస్తా

సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో మూడు హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి ఓజీ సినిమాపై పడింది. సుజీత్ దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న సినిమా ఓజీ.. (ఒరిజినల్ గ్యాగ్ స్టర్). ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. పవన్ కూడా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Anirudh Emotional Post on Blockbuster Talk For Jawan Movie
సినిమా వార్తలు

జవాన్‌ కు సూపర్ హిట్ టాక్.. అనిరుధ్ ఎమోషనల్ ట్వీట్

కింగ్ ఖాన్ షారుఖ్‌ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘జవాన్‌’. ఈ యేడాది షారుఖ్‌ ఖాన్ నుంచి 'పఠాన్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న మూవీ కారావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ అంచనాల నేపథ్యంలోనే జవాన్‌ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన షారుఖ్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ సోషల్‌ మీడియాలో పాజిటీవ్‌ రెస్పాన్స్ ఇస్తున్నారు. పఠాన్ బాటలోనే కింగ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల మూవీ చేశాడంటూ కితాబిస్తున్నారు. దేశవ్యాప్తంగా…

Srikanth Mవాట్సాప్
nikhil swayambhu movie latest update
సినిమా వార్తలు

స్యయంబు- 3నెలల ట్రైనింగ్ కోసం నిఖిల్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నిఖిల్. గతంలో కన్నా మరింత విభిన్నంగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది కార్తికేయ2, 18 పేజీస్ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు. ఇక ఈ ఏడాది స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆసినిమా మాత్రం మంచి విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Mammootty's Bramayugam First Look Out on His 72nd Birthday
ఫస్ట్ లుక్

మమ్ముట్టి బర్త్ డే.. భ్ర‌మ‌యుగం ఫస్ట్ లుక్ రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఒకవైపు ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ మలయాళం సహా అన్ని భాషల చిత్రాల్లో హీరోగా రాణిస్తున్న క్రమంలో మమ్ముట్టి కూడా కుమారుడికి ధీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రధాన పాత్రలో 'భ్రమయుగం' పేరుతో ఇటీవలే కొత్త సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 'భూతకాలం' ఫేమ్ రాహుల్ సదాశివన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ కథాంశంగా రూపొందుతోంది. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. నేడు మమ్ముట్టి 72వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్…

Srikanth Mవాట్సాప్
pawan kalyan joins in sets of ustaad bhagat singh for new schedule
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ బ్యాక్ టు యాక్షన్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈమధ్యే షూటింగ్ ను స్టార్ చేశారు.

TFN Adminవాట్సాప్
no cameos in shahrukh khan jawan movie says atlee
సినిమా వార్తలు

జవాన్ లో క్యామియో పై అట్లీ క్లారిటీ

పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు మరో సెన్సేషన్ జవాన్ తో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేేసింది.

TFN Adminవాట్సాప్

షేర్