జయపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించగా ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా హరోం హర సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు అభిలాష్ కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఈసినిమా మా నాన్న సూపర్ హీరో అనే టైటిల్ తో వస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమా షూటింగ్ పూర్తయిందని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుపుతూ చిన్న వీడియో అలానే ఫొటోలు కూడా పోస్ట్ చేశాడు.
It’s a wrap for #MaaNannaSuperHero 🎥! Happy to have worked with such a talented team and to have brought this project to life.@abhilashkankara @jaymkrish @vcelluloidsoffl @cam_entmnts pic.twitter.com/LIVhbajgtE
— Sudheer Babu (@isudheerbabu) September 5, 2023
కాగా ఆర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సాయిచంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ఇంకా యానీ పలు పాత్రల్లో నటిస్తున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కామ్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ తో కలిసి వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: