టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కాగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఈ నెల 7వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఆద్యంతం తనను ఆకట్టుకుందని, ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్‌ను ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని చిరంజీవి అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్ర యూనిట్ ఆయన కోసం ప్రత్యేకంగా స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ అనుష్క నటనను అప్రిషియేట్ చేసిన మెగాస్టార్.. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేశారంటూ యూవీ క్రియేషన్స్ విక్కీ, డైరెక్టర్ పి.మహేశ్ బాబును అభినందించారు. సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందిస్తూ.. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం’ అని పేర్కొన్నారు.
ఇంకా చిరంజీవి ఇలా చెప్పారు.. ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి.. కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి ఇద్దరూ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి వందశాతం ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు’ అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: