
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 55


రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా

1000కోట్ల క్లబ్ లోకి జవాన్

శివ కార్తికేయన్ -మురుగదాస్ కాంబినేషన్ ఫిక్స్

అఫీషియల్- పొంగల్ బరిలోనే శివకార్తికేయన్ అయలాన్

మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

పోకిరి మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగానే ఉంది

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్

నేను చేయాలనుకునే డైెరెక్టర్, హీరో వాళ్లే

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం

నిత్యామీనన్ కుమారి శ్రీమతి ట్రైలర్ రిలీజ్

పెళ్లి రూమర్స్ పై త్రిష స్ట్రాంగ్ కౌంటర్

సందీప్ కిషన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ షురూ
టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.

రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా
టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు ఒక పక్క పెద్ద పెద్ద హీరోలతో.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఒరింయెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. కథలో కంటెంట్ ఉంటే దిల్ రాజు చిన్న సినిమాలు కూడా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. రాజావారు రాణిగారు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రవి కిరణ్ కోలా. ఈసినిమాతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా మంచి విజయం సాధించింది.

1000కోట్ల క్లబ్ లోకి జవాన్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు షారుక్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు ఈనెల7న జవాన్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.కేవలం మూడు వారాల్లోపే ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరింది.ఈసందర్భంగా మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 1004.92కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.ఇండియాలో హిందీ వెర్షన్ నెట్ 18రోజుల్లో 505.94కోట్లు.కేవలం నార్త్ లోనే కాదుసౌత్ లో కూడా ఈసినిమా భారీ వసూళ్లను…

శివ కార్తికేయన్ -మురుగదాస్ కాంబినేషన్ ఫిక్స్
తమిళ హీరో శివ కార్తికేయన్ తన 23వ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేయనున్నాడు.ఈవిషయాన్ని ఈరోజు మురగదాస్ బర్త్ డే సంధర్బంగా ప్రకటించారు.దర్బార్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మురగదాస్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను ప్రకటించాడు.ఎన్వీ ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నాడు.మరి ఇది ఏ జోనర్ లో వస్తుందో తెలియాల్సి వుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలబడునున్నాయి.

అంగరంగ వైభవంగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు, ఏడు అడుగులతో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు అతిరథమహారథులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ నటీనటులు ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. స్థానిక లీలా ప్యాలెస్‌లో పంజాబీ…

అఫీషియల్- పొంగల్ బరిలోనే శివకార్తికేయన్ అయలాన్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అయలాన్ ఒకటి. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ 'మ్యాడ్'. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'బలగం' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని…

పోకిరి మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగానే ఉంది
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా కూడా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి ఇతర ప్రధాన…

ఓటీటీ లోకి వచ్చేసిన గాండీవధారి అర్జున
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు విజయ్ కు.. గత ఏడాది ఎఫ్3, గని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఎఫ్3 పర్వాలేద కానీ గని ఫ్లాప్ నే మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది గాండీవధారి అర్జున అనే సినిమాతో వచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.

నేను చేయాలనుకునే డైెరెక్టర్, హీరో వాళ్లే
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది. ప్రస్తుతం కంగనా నుండి రాబోతున్న సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఈసినిమా వస్తుంది.

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో 'కింగ్ ఆప్ కోత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. 'సీతారామం' తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించారు.

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

యానిమల్- ఇంట్రెస్టింగ్ గా రష్మిక ఫస్ట్ లుక్
సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో సినిమాపై బజ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రణబీర్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

పెళ్లి రూమర్లపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై.. అలా చేయడం నీచం
ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది సాయిపల్లవి. ఫిదా తరువాత సాయి పల్లవికి ఎన్నో ఆఫర్లు వరుసపెట్టి రాగా తాను మాత్రం సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అయితే నాగచైతన్య, చందూమొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది.

నిత్యామీనన్ కుమారి శ్రీమతి ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లలో మొదటివరుసలో ఉంటుంది నిత్యామీనన్ పేరు. ఎలాంటి గ్లామర్ డోస్ లేకుండానే కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది నిత్యామీనన్. అంతేకాదు ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.. కథ నచ్చకపోతే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేయడం కూడా నిత్యా ప్రత్యేకత. ప్రస్తుతం అయితే కుమారి శ్రీమతి అనే సినిమాతో వస్తుంది. ఇక ఈసినిమాలో కూడా నిత్యా చాలా సాధారణ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది.

రివ్యూ : సప్త సాగరాలు దాటి
ఓవరాల్ గా చూస్తే సప్త సాగరాలు దాటి సినిమా మంచి ఫీల్ ను అందిస్తూ హృదయాన్ని హత్తుకుంటుంది.హీరో హీరోయిన్ల నటన, సంగీతం,బీజీఎమ్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం సప్త సాగరాలు దాటేని మిస్ అవ్వొద్దు.

ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న ఏజెంట్
యంగ్ హీరో అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పట్లో ఈసినిమా విఫలంపై చిత్రయూనిట్ తో పాటు అఖిల్ కూడా స్పందించాడు.

లియో నుండి పవర్ ఫుల్ హిందీ పోస్టర్ రిలీజ్
ఈఏడాది వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నడ, తెలుగు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా హిందీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న హిందీ పోస్టర్ కూడా…

పెళ్లి రూమర్స్ పై త్రిష స్ట్రాంగ్ కౌంటర్
హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక కొద్దిరోజులుగా త్రిష పెళ్లిపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. త్రిష పెళ్లిపై వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. అందుకే త్రిష కూడా లైట్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ స్ట్రాంగ్…