టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో కొత్త సినిమాను మొదలుపెట్టేశాడు. సీవీ కుమార్ దర్శకత్వంలో గతంల ‘మాయవన్’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ రాబోతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్.
The #Maayavan Sequel 🔥
CommonMan Vs SuperVillain
Talented Hero @sundeepkishan & Visionary @icvkumar team up again for a Big scale Sci-Fi Action Thriller💥@AKentsOfficial Production No. 26 Launched Today 🎬
Music by the sensational @Music_Santhosh@AnilSunkara1… pic.twitter.com/aVbnPC3roO
— AK Entertainments (@AKentsOfficial) September 25, 2023
కాగా ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈసినిమా సందీప్ కు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: