ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది సాయిపల్లవి. ఫిదా తరువాత సాయి పల్లవికి ఎన్నో ఆఫర్లు వరుసపెట్టి రాగా తాను మాత్రం సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అయితే నాగచైతన్య, చందూమొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా రూమర్లకు కాస్త దూరంగా ఉండే సాయి పల్లవిపై కూడా ఇప్పుడు రూమర్లు మొదలయ్యాయి. రెండు రోజుల నుండి సాయి పల్లవి పెళ్లి గురించి రూమర్లు మొదలయ్యాయి. నేను ఎప్పుడూ రూమర్లను పట్టించుకోను.. కానీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తుండటంతో స్పందించక తప్పడం లేదు.. నాసినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో దిగిన ఫొటోలను క్రాప్ చేసి ఇలా సర్కిలేట్ చేయడం నీచం.. నా సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వాల్సిన టైమ్ లో ఇలాంటి వాటిపై స్పందించడం చాలా బాధాకరం.. ఒక వ్యక్తిని ఇలా బాధపెట్టడం కూడా నీచమే అంటూ పోస్ట్ లో పేర్కొంది. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.
Honestly, I don’t care for Rumours but when it involves friends who are family, I have to speak up.
An image from my film’s pooja ceremony was intentionally cropped and circulated with paid bots & disgusting intentions.
When I have pleasant announcements to share on my work…— Sai Pallavi (@Sai_Pallavi92) September 22, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: