దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ ప్రారంభం

Dulquer Salmaan's New Telugu Movie Lucky Bhaskar Shoot Begins

‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో ‘కింగ్ ఆప్ కోత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్‌ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ‘సీతారామం’ తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ షూటింగ్ ఆదివారం (సెప్టెంబర్ 24, 2023) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, దర్శకుడు, నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ సినిమా మంచి కథతో రూపొందుతోందని, ఘనవిజయం సాధిస్తుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి యొక్క అసాధారణమైన ప్రయాణం ఇత్తివృత్తంతో ‘లక్కీ భాస్కర్’ చిత్రం రూపొందుతుందని దర్శకుడు తెలిపారు.

కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ గత కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలను అందిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చురుకైన నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. వారు ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టారు. సార్/వాతి తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో ఇది వారి రెండవ పాన్-ఇండియా చిత్రం కావడం గమనార్హం. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.