హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. అందులోనూ ముఖ్యంగా వారి వ్యక్తిగత విషయాలపై అందరికీ ఇంకాస్త ఎక్కువగానే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి.. ఏదైనా ఛాన్స్ దొరికితే చాలు వారి వ్యక్తిగత విషయాలపైనే రూమర్స్ పుట్టించేస్తుంటారు. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇక కొద్దిరోజులుగా త్రిష పెళ్లిపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. త్రిష పెళ్లిపై వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. అందుకే త్రిష కూడా లైట్ తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొద్దిరోజులుగా ఓ మలయాళం నిర్మాతతో త్రిష పెళ్లి జరుగుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ వార్తలు జోరుగా వస్తుండటంతో ఇప్పుడు త్రిష ఆ వార్తలకు చెక్ పెట్టేసింది. తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ డియర్ మీరు ఎవరో.. మీ టీమ్ ఎవరో మీకు తెలుసు.. ఇక్కడితో రూమర్స్ కు చెక్ పెట్టండి.. చీర్స్ అంటూ తన ట్వీట్ లో పేర్కోంది. దీంతో రూమర్లకు త్రిష్ చెక్ పెట్టినట్టైంది.
DEAR “YOU KNOW WHO YOU ARE AND YOUR TEAM”,
“KEEP CALM AND STOP RUMOURING”
CHEERS!— Trish (@trishtrashers) September 21, 2023
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సినీ కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడింది. ఈసినిమాలో ఇంకా ప్రమోషన్స్ లో త్రిష తన గ్లామర్ తో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది. దీంతో త్రిషకు మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా వస్తున్న లియో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో వస్తున్న రోడ్ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా జితూ జోసెఫ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తుంది. వీటితో పాటు ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: