బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది. ప్రస్తుతం కంగనా నుండి రాబోతున్న సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లపై ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసే కంగనాకి కూడా ఫేవరెట్ డైరెక్టర్, హీరో కూడా ఉన్నారు. ప్రస్తుతం కంగనా చంద్రముఖి2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనాను ఏ డైరెక్టర్ తో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు అని అనగా.. అందుకు కంగనా నేను వర్క్ చేయాలని కోరుకుంటున్న డైరెక్టర్ రాజమౌళి సార్.. ఇంకా నేను చేయాలనుకుంటున్న హీరో రామ్ చరణ్. నేను రామ్ చరణ్ కి ఫ్యాన్ ను అంటూ తెలిపింది. మరి ఫ్యూచర్ లో కంగనాకు వీరితో పనిచేసే ఛాన్స్ వస్తుందో?లేదో? చూద్దాం..
కాగా ఈసినిమాలో వడివేలు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి.వాసునే ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. మరి సీక్వెల్ లో ఎలా ఉంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: