టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న మూవీ ‘మ్యాడ్’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ కూడా హీరోలుగా నటిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సునీల్ కుమార్, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బలగం‘ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్ 6వ తేదీన మ్యాడ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రబృందం.. “మ్యాడెనింగ్ ఎంటర్‌టైనర్‌తో అక్టోబర్ 6న థియేటర్‌లలో మిమ్మల్ని కలవడానికి అత్యంత సరదా మరియు క్రేజీ గ్యాంగ్ వస్తోంది” అని అందులో పేర్కొంది. కాగా ఇటీవలే రిలీజ్ చేసిన మ్యాడ్ ఫస్ట్ సింగిల్ ప్రోమోకు మంచి అప్లాజ్ వచ్చింది. ‘ప్రౌడ్ సే సింగిల్’ అంటూ సాగిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వర పరిచగా.. సింగర్ నాకాష్ అజిజ్ ఎంతో జోష్ తో ఆలపించారు. అలాగే ఆగస్ట్ 31న విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు యూత్‌లో అద్భుత స్పందన వచ్చింది.
The most insanely fun and crazy gang is coming to meet you at theatres on 𝐎𝐂𝐓 𝟔𝐭𝐡 with MADdening entertainer. 😎#MADon6thOctober 🥳#MADtheMovie @kalyanshankar23 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan #RamNitin @gouripriyareddy… pic.twitter.com/bwpoM3Lw8z
— Naga Vamsi (@vamsi84) September 25, 2023
కాలేజ్‌గ్యాంగ్స్, సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్య ర్యాగింగ్, ప్రేమలు, గొడవలు.. ఇలా ఓ మాంచి రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉండబోతుందని టీజర్‌తో అర్ధమైంది. ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మ్యాడ్ సినిమా ద్వారా రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె, నిర్మాత నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. అయితే ఇదిలా ఉండగా.. మరోవైపు నార్నే నితిన్ హీరోగా నటించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో కూడా నితిన్ ఓ మూవీ చేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: