తమిళ హీరో శివ కార్తికేయన్ తన 23వ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేయనున్నాడు.ఈవిషయాన్ని ఈరోజు మురగదాస్ బర్త్ డే సంధర్బంగా ప్రకటించారు.దర్బార్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మురగదాస్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను ప్రకటించాడు.ఎన్వీ ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నాడు.మరి ఇది ఏ జోనర్ లో వస్తుందో తెలియాల్సి వుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలబడునున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే శివ కార్తికేయన్ సాలిడ్ లైనప్ తో వస్తున్నాడు.ఇటీవలే మహావీరుడుతో హిట్ కొట్టిన ఈహీరో ప్రస్తుతం అయలాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.హీరో,ఏలియన్ తో సాగే కామెడీ డ్రామాగా తెరక్కుతుంది.విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుంది.వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.రవికుమార్ డైరెక్ట్ చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈసినిమా కాకుండా శివ కార్తికేయన్ తన 21వ సినిమాను రాజ్కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో చేయనున్నాడు అయితే 22వ సినిమాలో విషయంలో క్లారిటీ రావాల్సి వుంది.ఇవే కాకుండా ప్రముఖ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమా డిస్కషన్ లో వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: