‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. దీని ప్రకారం.. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న కొందరు నటీనటులు అందుబాటులో లేనందున సెప్టెంబర్‌లో జరగాల్సిన షెడ్యూల్‌ను కాన్సిల్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే అక్టోబర్ రెండో వారంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. కొత్త షెడ్యూల్‌కి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దర్శకుడు శంకర్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో పాటు మరోవైపు ‘ఇండియన్ 2’ సినిమాను కూడా ఏకకాలంలో చేస్తున్నారు. ‘ఇండియన్ 2’ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తున్నారు. 1996లో వీరిద్దరి కలయికలోనే వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’కి సీక్వెల్ గా దీనిని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: