తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టి.ఎప్పటికప్పుడు డిఫ్రెంట్ కంటెంట్ తో వచ్చి హిట్లు కొట్టడం ఈహీరోకు అలవాటు.గత ఏడాది చార్లీ 777తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తెలుగులో కూడా ఈసినిమా బాగానే ఆడింది.ఇక రక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ సప్త సాగర దాచే ఎల్లో.ఈనెల 1న కన్నడ లో విడుదలైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది.ఈసినిమాను సప్త సాగరాలు దాటి అనే పేరుతో తెలుగులో ఈరోజు రిలీజ్ చేశారు.మరి ఈసినిమా ఎలా వుంది? తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ :
మను (రక్షిత్ శెట్టి) శంకర్ గౌడ్ అనే పెద్ద వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్ గా పనిచేస్తుంటాడు.ఎప్పటికైనా ట్రావెల్ ఏజెన్సీ పెట్టి లైఫ్ లో స్థిరపడాలి అనేది అతని కోరిక.ఇదిలావుండగా ప్రియా (సింగర్) ను చూసి మను ప్రేమలో పడతాడు. ప్రియాకి కూడా మనుఅంటే ఇష్టమే. వీరి ప్రేమకు ఎవరు అడ్డుపడరు.పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటారు.ఈ క్రమంలో మను తీసుకున్న ఓ నిర్ణయంతో అతని జీవితమే తల్లకిందులు అవుతుంది. ఆ నిర్ణయంతో మను జైలు పాలవుతాడు.ఆతరువాత ఏమైంది ? ప్రియా,మనుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ఇదొక విషాదాంతంతో నిండిన ప్రేమ గాథ.ఒక తప్పుడు నిర్ణయం ఇద్దరు ప్రేమికుల జీవితాలను ఏవిధంగా ప్రభావితం చేసింది దాని వల్ల ఎలాంటి సంఘర్షణకు లోనయ్యారు అనేది ఈసినిమా కథ.ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే తోపాటు అద్బుతమైన సంగీతం,బీజీఎమ్ అవసరం.ఈవిషయాల్లో సప్త సాగరాలు దాటే ఎక్కడా నిరాశపరచదు.మను,ప్రియాల లవ్ ట్రాక్ దగ్గర నుండి ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు దర్శకుడు.
మనిషిగా పుట్టలేదు మనిషిలా మారడం కోసం పుట్టాము ఇలాంటి అర్ధవంతమైన డైలాగ్స్ చాలానే వున్నాయి.ప్రేక్షకుడిని సినిమాలోని పాత్రలతో ప్రయాణం చేయించడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. ఇది మొదటి భాగం మాత్రమే దీనికి కొనసాగింపుగా రెండో భాగం కూడా రానుంది.అక్టోబర్ లో విడుదలచేయనున్నారు.మొదటి భాగంలో చివర్లో వచ్చే సన్నివేశాలు రెండో భాగంఫై అంచనాలను పెంచేలా వున్నాయి.తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది. సాంగ్స్ వినసొంపుగా అనిపిస్తాయి.ఓవరాల్ గా సప్త సాగరాలు దాటి అనే సినిమా ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ.దీనికి అద్భుతమైన సాంగ్స్ ,బీజీఎమ్ తోడుకావడంతో సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది.విషాదాంతంతో కూడిన ప్రేమకథలను ఇష్ట పడే వారికి విపరీతంగా నచ్చుతుంది.
నటీనటుల విషయానికి వస్తే రక్షిత్ శెట్టి,మను పాత్రలో జీవించేశాడు.డ్రెస్సింగ్ దగ్గర్నుండి ప్రతి ఒక్కదానిపై శ్రద్ధ పెట్టి తెర ఫై మను మాత్రమే కనిపించేలా నటించాడు.ఇక హీరోతో పాటు సమానంగా నటించింది హీరోయిన్ రుక్మిణి వసంత్.ముఖ్యంగా కళ్ళతో ప్రేమను తెలుపే సన్నివేశాలతో అద్భుతంగా చేసింది.ప్రియా పాత్రకు రుక్మిణి బాగా సెట్ అయ్యింది. ప్రముఖ నటుడు అచ్యుత్ కుమార్ మరో సారి తన ప్రతిభ చూపెట్టారు.పవిత్రా లోకేష్ కీలక పాత్రలో కనిపించింది.
ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు హేమంత్ ఎమ్ రావు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అద్భుతంగా తెర మీదకు తీసుకరావడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే మిగితా టెక్నీకల్ విభాగం సినిమాకు బాగా సహకరించారు.ముఖ్యంగా సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. సాంగ్స్ తో పాటు బీజీఎమ్ సినిమాలో హైలైట్ అయ్యాయి అలాగే సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ విభాగాలు కూడా మంచి పనితీరును ప్రదర్శించాయి.నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా వున్నాయి.
ఓవరాల్ గా చూస్తే సప్త సాగరాలు దాటి సినిమా మంచి ఫీల్ ను అందిస్తూ హృదయాన్ని హత్తుకుంటుంది.హీరో హీరోయిన్ల నటన, సంగీతం,బీజీఎమ్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం సప్త సాగరాలు దాటేని మిస్ అవ్వొద్దు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: