
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 56


అమెరికాలో ఇంకా తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్

స్కంద ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

చంద్రముఖి 2 సెన్సార్ పూర్తి, రన్‍టైమ్ ఎంతంటే..?

దేవరతో AI ఇల్యూజన్ ఆట

కృతి ఎమోషనల్ పోస్ట్.. అవే ఈరోజు ఈస్థానంలో ఉంచాయి

నేషనల్ మూవీ డే- రూ.99 కే టికెట్

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

శర్వా 35 నుండి కృతిశెట్టి స్పెషల్ వీడియో

కృతి పాన్ ఇండియా ARM మూవీ నుండి ఫస్ట్ లుక్ రిలీజ్
కరోనా వల్ల మలయాళం సినిమాలంటే సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకే అక్కడి మేకర్స్ కూడా తమ సినిమాలకు ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా ఈమధ్య కాలంలో తన సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో టొవినో థామస్. మిన్నన్ మురళీ, రీసెంట్ గా వచ్చిన 2018 సినిమాలతో తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. జితిన్ లాల్ దర్శకత్వంలో టొవినో థామస్ హీరోగా వస్తున్న సినిమా ఏఆర్ఎమ్ (అజయంతే రందమ్ మోషనమ్). ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి టీజర్ ను…

అమెరికాలో ఇంకా తగ్గని 'ఆర్ఆర్ఆర్' క్రేజ్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. దేశీయంగానే కాకుండా విదేశాల్లో సైతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్, హెచ్‌సీఏ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్, 46వ ‘జపాన్ అకాడమీ అవార్డు, 69వ ఇండియన్ నేషనల్ అవార్డ్ సహా మరికొన్నింటిని ‘ఆర్ఆర్ఆర్’ దక్కించుకుంది.

స్కంద ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత మాస్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా స్కంద. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నాడు బోయపాటి. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమా సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా పడింది. ఇక రిలీజ్ కు డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల దగ్గరనుండి పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

చంద్రముఖి 2 సెన్సార్ పూర్తి, రన్‍టైమ్ ఎంతంటే..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జంటగా నటించిన నూతన చిత్రం చంద్రముఖి 2. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‍గా రూపొందుతోంది. కాగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన ఏకకాలంలో రిలీజ్ కానుంది. అయితే వాస్తవానికి ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది.

7/జీ బృందావన కాలనీ రీ రిలీజ్.. థియేటర్స్ వద్ద యూత్ సందడి
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న రీ రిలీజ్‌ల పరంపరలోకి మరో కల్ట్ సినిమా వచ్చి చేరింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ మరోసారి విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా సినిమాలు ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తుండవు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతుంటాయి. ప్రేక్షకులను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకుని మైమరిచిపోయేలా చేస్తాయి. అలాంటివాటిలో ఎక్కువగా ప్రేమ కథలే ఉంటాయి. ఈ కోవలో వచ్చిందే 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' సినిమా. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదలై 200 రోజులకి పైగా…

దేవరతో AI ఇల్యూజన్ ఆట
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది పైన అయిపోయింది. అప్పటికే ఆర్అర్ఆర్ సినిమా కోసమే చాలా ఏళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుంత ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

ఓటీటీలోకి బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి గుర్తింపు పొందిన నేటి జెనరేషన్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. 'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనంతరం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం 'బెదురులంక 2012'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, జబర్దస్త్ రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, దివ్య…

యానిమల్ నుండి అనిల్ కపూర్ లుక్ రిలీజ్
అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించి ఆసినిమాతో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా. ఆ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతోనే బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ చేసే ఛాన్స్ కొట్టేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుండటం వల్లే ఆగష్ట్ లో రిలీజ్ కావాల్సిన సినిమా డిసెంబర్ కు వెళ్లింది.

కృతి ఎమోషనల్ పోస్ట్.. అవే ఈరోజు ఈస్థానంలో ఉంచాయి
ఉప్పెన సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది కృతిశెట్టి. ఇక ఆసినిమా తరువాత వరుస ఆఫర్లు అందుకొని అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక నేేడు కృతిశెట్టి పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె సినిమాల నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు వచ్చాయి. ఇదిలా ఉండగా తన పుట్టినరోజుకు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేసింది కృతి శెట్టి. మరో ఏడాదిలోకి అడుగుపెట్టేశాను. నేను చాలా కృతజ్ఞురాలిని..సంతోషం, ప్రేమ, బాధ, ధ్వేషం ఇలా ఎన్నో అనుభవాలను ఎక్స్ పీరియన్స్ చేశాను. అవన్నీ ఈరోజు నన్న ఈస్థానంలో ఉంచాయి.. నాలో స్పూర్తి నింపుతున్న నా కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి…

సప్త సాగరాలు దాటి.. భావోద్వేగాలతో కూడిన ఓ అందమైన ప్రయాణం
కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. 'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో…

నేషనల్ మూవీ డే- రూ.99 కే టికెట్
ఇప్పుడు మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్లు ఎంత పెరిగిపోయాయో చూశాం. ఒకప్పుడైతే సినిమా చూడటానికి థియేటర్లకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాలు అంటే పిచ్చి.. ఇంకా అభిమానులు మాత్రమే ఇంట్రెస్టింగ్ గా థియేటర్లకు వెళుతున్నార. ఒకరకంగా థియేటర్లకు ఆడియన్స్ తగ్గడానికి కూడా ఈ రేట్లు ఒక కారణమని చెప్పొచ్చు. కొన్ని రోజులైతే ఓటీటీలోకి వచ్చేస్తుంది అప్పుడు చూడొచ్చన్న కాన్సెప్ట్ లో కూడా చాలామంది ఉంటున్నారు.

ప్రధాని మోదీ కార్యాలయంలో స్టార్ హీరోయిన్స్ సందడి, కారణమేంటంటే..?
భారత్‌లోని వివిధ భాషల చిత్రపరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖ నటీమణులు గురువారం పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పిలుపు మేరకు వారు ఈరోజు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాదా, మంచు లక్ష్మీ, సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్, దివ్యా దత్తా సహా పలువురు నటీమణులు ఉన్నారు. ఈ సందర్భంగా నటీమణులందరూ కలిసి దిగిన ఫోటోను నటి ఖుష్బూ తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అలాగే దీనికి 'విమెన్ ఎన్పవర్మెంట్, విమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023, న్యూ ఢిల్లీ' అని కేప్షన్ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్…

మైత్రి మూవీస్ లో సినిమా చేయనున్న నవీన్ పోలిశెట్టి
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి భారీ ఆఫర్ పట్టేశాడు.జాతిరత్నాలు తరువాత యూవీ క్రియేషన్స్ లో నటించి హ్యాట్రిక్ కొట్టిన ఈహీరో ఇప్పుడు మరో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చేశారు మైత్రి నిర్మాతలు.నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో విజయం సాధించినందుకు మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని,రవి శంకర్.. నవీన్ పోలిశెట్టి ని కలిసి అభినందించారు.ఈ సందర్భంగా త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాం.. ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ చూడడానికి మీరు రెడీ ఆ అంటూ మైత్రి మూవీస్ మేకర్స్ ట్వీట్ చేసింది దాంతో నవీన్ పోలిశెట్టితో మైత్రి…

పెదకాపు1 లో నా పాత్ర స్ట్రాంగ్, ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది
యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్ ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమాలో కీలక పాత్రలో నటించిన అనసూయ తాజాగా ఓ ఇంటర్య్వూ ఈసినిమా గురించి…

జవాన్ ఓటిటి వెర్షన్ సప్రైజ్ ఇవ్వనుంది
షారుక్ ఖాన్ జవాన్ ఈవారంలో1000కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు విడుదలైన నెలలోపే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డులోకెక్కనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా షారుక్ స్టైల్,స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.దానికితోడు మేజర్ సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా కలిసొచ్చింది.కేవలం నార్త్ లోనే కాదు జవాన్ సౌత్ లోకుడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.తెలుగు,తమిళంలో కలిపి ఫుల్ రన్ లో100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఓ బాలీవుడ్ మూవీ ఈరేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్
పెద్ద సినిమాలకు లీక్స్ రావడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతున్నాయి. ఎంతో జాగ్రత్త పడే రాజమౌళికే ఈలీకుల బాధలు తప్పలేదు. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఏకంగా లిరికల్ సాంగే లీకయ్యింది. దీంతో చిత్రనిర్మాణ సంస్థ కేసు కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా మేకర్స్ కూడా లీకు రాయుళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడీ.

కేబుల్ రెడ్డి నుండి సుహాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
షార్ట్ ఫిలింస్ లో తన నటన ద్వారా ఆకట్టుకొని ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. ఎన్నో సినిమాల్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో.. సపోర్టింగ్ రోల్స్ లో నటించి తన మార్క్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే హిట్ ను అందుకొని ప్రస్తుతం చిన్న సినిమాలకు బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తున్నాడు సుహాస్. ఇటీవలే రైటర్ పద్మభూషణం అనే సినిమాతో వచ్చి ఆసినిమాతో కూడా హిట్ ను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ టు హిట్లను అందుకున్న సుహాస్ ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతుం షూట్ ను పూర్తిచేసుకుంటుంది. గీతాఆర్ట్స్…

జోరుగా హుషారుగా షికారు పోదమ ఫస్ట్ లుక్ రిలీజ్
గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు టాలీవుడ్ కుర్రహీరో సంతోష్ శోభన్. ఇక ఆతరువాత తను నేను, పేపర్ బాయ్ అంటూ పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో డీసెంట్ హిట్ లను అందుకున్నాడు. ఈమధ్య కాలంలో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ఇంకా అన్నీ మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్ సినిమాలు వచ్చాయి. అవి కూడా సరైన విజయాలని అందించలేకపోయాయి.

స్కంద నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ
టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం 'స్కంద'. ఈ సినిమాలో రామ్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. 'అఖండ' సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను నుంచి వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

శర్వా 35 నుండి కృతిశెట్టి స్పెషల్ వీడియో
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతిశెట్టి. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో అలరించింది. ఇక ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కృతిశెట్టికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోల పక్కన జతకట్టేసింది కృతిశెట్టి. అయితే కృతిశెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెెళుతుది కానీ ఈమధ్య కాలంలో సరైన హిట్ మాత్రం పడలేదు. ఈ ఏడాది కస్టడీ రిలీజ్ అయింది ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. తన కొత్త సినిమాలతో హిట్ కొట్టాలని చూస్తుంది.