బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు షారుక్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు ఈనెల7న జవాన్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.కేవలం మూడు వారాల్లోపే ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరింది.ఈసందర్భంగా మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 1004.92కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.ఇండియాలో హిందీ వెర్షన్ నెట్ 18రోజుల్లో 505.94కోట్లు.కేవలం నార్త్ లోనే కాదుసౌత్ లో కూడా ఈసినిమా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.నిన్నటివరకు తెలుగు,తమిళ వెర్షన్ లు కలిపి100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
History in the maKING ft. Jawan! 🔥
Have you watched it yet? Go book your tickets now! https://t.co/B5xelU9JSg
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/rhJSF0vdsw
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 25, 2023
అట్లీ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించి అదరగొట్టాడు.దీపికా పదుకోణ్ ,నయనతార హీరోయిన్లు గా నటించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.ఇక ఈఏడాది చివర్లో మరో సినిమాతో రానున్నాడు షారుక్. అదే డుంకి.ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేస్తున్నాడు.డిసెంబర్ 22న విడుదలకానుంది.మరి ఈసినిమా కూడా హిట్ అయితే ఒకటే ఏడాది మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించనున్నాడు షారుక్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: