బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు, ఏడు అడుగులతో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు అతిరథమహారథులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ నటీనటులు ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. స్థానిక లీలా ప్యాలెస్‌లో పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకకు ముందు మెహందీ, సంగీత్ వేడుకలు జరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1990ల థీమ్ సాంగ్స్‌తో ప్రముఖ గాయకుడు నవరాజ్ హన్స్ సారథ్యంలో సంగీత్ నైట్ నిర్వహించారు. దీనిలో భాగంగా పంజాబీ ట్యూన్‌లకు సీఎం భగవంత్ మాన్ కాలు కదిపడం విశేషం. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రాఘవ్ చద్దా పరిణీతి చోప్రా మెడలో మూడుముళ్లు వేశారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విచ్చేసిన అతిథుల కోసం ఆసియా, భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు. ఇక వివాహం అనంతరం ఈ జంటను అంతా ‘రాగ్‌ణీతి’ అని పిలుస్తుండటం గమనార్హం. కాగా రాఘవ్, పరిణీతి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా విద్యాభ్యాసం చేశారు. పరిణీతి బాలీవుడ్ నటిగా రాణిస్తుండగా.. రాఘవ్ చద్దా ఆప్ తరపున ఎంపీగా కొనసాగుతున్నారు.
ఇక వివాహానికి సంబంధించిన పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా పరిణీతి చోప్రా ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు. అందులో.. ‘‘మా మొదటి బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ నుంచి ఒకరికొకరం బాగా తెలుసు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణమిది. అందరి బ్లెసింగ్స్‌తో ఇద్దరం భార్యభర్తలు అయ్యాం. ఇకపై ఒకరి కోసం ఒకరు బతుకుతాం. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తోపాటు పరిణీతి పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన అభిమానులు రాఘవ్-పరిణీతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలియా భట్, కత్రినా కైఫ్ సహా పలువురు తారలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs!
Couldn’t have lived without each other .. Our forever begins now .. 💖 pic.twitter.com/M1xQ8BIHLt
— Parineeti Chopra (@ParineetiChopra) September 25, 2023
ఈ యేడాది మే 13న పరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుక ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు. కాగా గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఢిల్లీలో ఓ హోటల్‌లో డిన్నర్ డేట్‌కు వచ్చిన సమయంలో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి మీడియాలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇక పరిణీతి, స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి ప్రియాంక హాజరుకాలేదు. కానీ కొత్తజంటకు మ్యారేజ్ విషెస్ తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: