సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్ వైలెంట్ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో సినిమాపై బజ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రణబీర్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమాలో కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న అనిల్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బల్బీర్ సింగ్ పాత్రలో అనిల్ కుమార్ నటించనున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో గీతాంజలి పాత్రలో నటిస్తుంది రష్మిక.
— Rashmika Mandanna (@iamRashmika) September 23, 2023
కాగా ఈసినిమాలో అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: