ఈఏడాది వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నడ, తెలుగు పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా హిందీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవర్ ఫుల్ గా ఉన్న హిందీ పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Keep calm and face the devil #LeoHindiPoster#LEO pic.twitter.com/LH6iUxAPWx
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 21, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























