టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం ‘లైగర్’ భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఖుషి’ వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా ‘శాకుంతలం’ పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందిన ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన సాంగ్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఫీల్ గుడ్ మూవీగా సినీ ప్రియులను అలరించిన ‘ఖుషి‘ సినిమాకి సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
అక్టోబర్ 1 నుంచి ‘ఖుషి’ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. దీని ప్రకారం.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ చిత్రం థియేటర్‌లలో విడుదలైన సరిగ్గా ఒక నెల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. దీంతో ఖుషి కోసం విజయ్ దేవరకొండ, సమంత అభిమానులతో పాటు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, జయరామ్, అలీ, రోహిణి మరియు మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
‘ఖుషి’ సినిమా కథ ఏంటంటే..?
విప్లవ్ (విజయ్ దేవరకొండ) ఉద్యోగరీత్యా కాశ్మీర్ వెళతాడు. అక్కడ తొలిచూపులోనే ఆరాధ్య (సమంత)ను చూసి మనసు పారేసుకుంటాడు. అయితే ముస్లిం అమ్మాయి వేషధారణలో ఉండటంతో ఆరాధ్యకి దగ్గర కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో విప్లవ్, ఆరాధ్యకు కొన్ని విషయాల్లో సహాయం చేయడంతో తను కూడా విప్లవ్ ను ఇష్ట పడుతుంది. అయితే ఒక సందర్భంలో ఆరాధ్య తాను ముస్లిం కాదు, బ్రాహ్మిన్ అమ్మాయిని అని ట్విస్ట్ ఇస్తుంది. ఇక విప్లవ్ నాన్న లెనిన్ సత్యం( సచిన్ కెడ్కర్) నాస్తికుడు కాగా.. ఆరాధ్య తండ్రి (మురళీ శర్మ) ప్రవచనాకారుడు. అయితే ఎలాగోలా విప్లవ్, ఆరాధ్య ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వారి వైవాహిక జీవితం ఎలా సాగింది? వేర్వేరు మతాలకు చెందిన ఈ జంట కలిసి ఉండే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇరు కుటుంబాల మధ్య సఖ్యత కుదిరిందా? అనేది మిగితా కథ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: