మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు విజయ్ కు.. గత ఏడాది ఎఫ్3, గని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఎఫ్3 పర్వాలేద కానీ గని ఫ్లాప్ నే మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది గాండీవధారి అర్జున అనే సినిమాతో వచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈసనిమా హక్కులను సొంతం చేసుకొని.. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందేకదా. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
#GandeevadhariArjuna is now locked and loaded on @netflix 🎯
Your weekend just hit the bullseye for non-stop action 💥 #GandeevadhariArjunaOnNetflix@IAmVarunTej @sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/zDi2Gyg24s
— SVCC (@SVCCofficial) September 24, 2023
ప్రస్తుతం వరుణ్ తేజ్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఆపరేషన్ వేలంటైన్ అనే సినిమాను చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: