యంగ్ హీరో అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పట్లో ఈసినిమా విఫలంపై చిత్రయూనిట్ తో పాటు అఖిల్ కూడా స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి సందడి చేయడానికి వచ్చేస్తుంది. అప్పట్లో ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కానీ రిలీజ్ అవ్వలేదు. దీంతో ఎన్నో రోజులుగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ఆ ఎదురుచూపులకుబేక్ పడింది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ కానుంది.
The wait is over! Brace yourself for the wild adrenaline rush!
The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1— Sony LIV (@SonyLIV) September 22, 2023
కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నంటించాడు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించంగా.. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చాడు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా… ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: