తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అయలాన్ ఒకటి. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమాను ఈఏడాదే దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుండంతో రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాను వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఆవార్తలకు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
#AyalaanFromPongal #AyalaanFromSankranti 😊👍#Ayalaan 👽 pic.twitter.com/bbyf0PAoHP
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 23, 2023
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: