పోకిరి మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగానే ఉంది

kangana ranaut about pokiri movie

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా కూడా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా ఫస్ట్ ఛాయిస్ కంగనా అని ఇప్పటికే తను గతంలో తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. తాజాగా మరోసారి ఈసినిమా గురించి చెప్పుకచ్చింది కంగనా. కంగనా ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా 2005 లో గ్యాంగ్ స్టర్, పోకిరీ సినిమాలకు ఆఫర్స్ వచ్చాయి.. అయితే గ్యాంగ్ స్టర్ సినిమా చేశాను.. ఇక రెండు సినిమాలు కూడా ఒకే రోజు 2006, ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయ్యాయి.. రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.. కానీ పోకిరి సినిమాను మిస్ అయినందుకు ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అంటూ తెలిపింది.

పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగనా ప్రధానా పాత్రల్లో చంద్రముఖి2 సినిమా వస్తుంది. ఈసినిమా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఈసినిమాలో ఇంకా వడివేలు కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈసినిమాకు రాజశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =