
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 124


#RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్

NTR 30 కోసం హాలీవుడ్ యాక్షన్ కోరియోగ్రాఫర్

టాకీ పూర్తి చేసిన పవన్

హెల్త్ కండీషన్ పై సామ్ రియాక్షన్

సలార్- ఫైర్ మోడ్ లో షూట్

నితిన్ కల్ట్ మూవీ రీ రిలీజ్

PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్

దాస్ కా ధమ్కీ 3 డేస్ కలెక్షన్స్

కట్స్ విషయంలో రికార్డు సృష్టించిన దసరా

పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను – జాన్వీ కపూర్

ఇంటర్నేషనల్ సెన్సేషన్ కు ఏడాది

ప్రారంభం అయిన దసరా మూవీ బుకింగ్స్

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది

రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఉగాది బెస్ట్ యాక్టర్ గా బింబిసార కళ్యాణ్ రామ్

2024 సంక్రాంతి కానుకగా #SSMB 28
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్నఈ మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

#RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

NTR 30 కోసం హాలీవుడ్ యాక్షన్ కోరియోగ్రాఫర్
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా ఫైనల్ గా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. అందులోనూ జనతా గ్యారేజ్ లాంటి హిట్ తరువాత కొరటాల దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే కొరటాల కూడా ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రేంజ్ లోనే కథను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సినిమా కోసం షూటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది.

టాకీ పూర్తి చేసిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యనే సముద్రఖని సినిమాను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఈసినిమా అలా ప్రకటించారో లేదో వెంటనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. అంతేకాదు పవన్ కూడా ఈసినిమా కోసం డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ లో వెంటనే పాల్గొన్నాడు. ఇక పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా పవన్ షూట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ టాకీ పార్ట్ పూర్తయిందని…

హెల్త్ కండీషన్ పై సామ్ రియాక్షన్
స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు ఫామ్ అయింది. గత ఏడాది సమంతకు మయోసైటిస్ ఎటాక్ అయ్యింది. అప్పటినుంచి పోరాటం చేస్తున్న సామ్ ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. సినిమాల షూటింగ్ లలో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను తీసుకొని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ మారింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది సమంత. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన హెల్త్ కండీషన్ పై అప్ డేట్ ఇచ్చింది. తాను ఇప్పుడిప్పుడే…

సలార్- ఫైర్ మోడ్ లో షూట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు అభిమానులు కూడా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

థమన్ ఎస్ బ్యాటింగ్ తో ఫైనల్స్ కు చేరుకున్న తెలుగు వారియర్స్
సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలకి దేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు కలిసి ఒకే ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తే.. అదే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ . కొంతకాలంగా జరగకుండా ఆగిపోయిన ఈ లీగ్ మ్యాచ్స్ ఇటీవలే మళ్ళీ తిరిగి మొదలయ్యాయి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో భోజపురి దబాంగ్స్ , ముంబై హీరోస్ , తెలుగు వారియర్స్ ), కర్ణాటక బుల్ డోజర్స్ టీమ్స్ సెమీ ఫైనల్స్ కి చేరుకున్నాయి.

నితిన్ కల్ట్ మూవీ రీ రిలీజ్
హీరోల బర్త్ డే ల సందర్భంగా వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కేవలం బర్త్ డే అనే కాదు స్పెషల్ డే లు వున్నా కూడా ఇది రిపీట్ అవుతుంది. అందులో భాగంగా జల్సా , ఖుషి ,గబ్బర్ సింగ్,ఒక్కడు, పోకిరి,బిల్లా, వర్షం ఇలా మరి కొన్ని సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 25,26న ఆరెంజ్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది.

PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయితేజ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ జూలై 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కేతిక శర్మ , రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు , స్క్రీన్ ప్లే అందించడం విశేషం .

దాస్ కా ధమ్కీ 3 డేస్ కలెక్షన్స్
విశ్వక్ సేన్ ,దాస్ కా ధమ్కీ వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీ గా కలెక్షన్స్ ను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ అదరగొడుతుంది. ఇప్పటివరకు అక్కడ 250k గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా 3రోజుల్లో ధమ్కీ, ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరో కోటి రూపాయల షేర్ వస్తే చాలు మూవీ బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈరోజుతో ఆమార్క్ ను చేరుకోనుంది. ఇక కేవలం మూడు రోజుల్లోనే ధమ్కీ ,విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. యూత్ ఫుల్…

కట్స్ విషయంలో రికార్డు సృష్టించిన దసరా
నాని నటించిన పాన్ ఇండియా మూవీ, దసరా విడుదలకు సిద్దమవుతుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈసినిమా సెన్సార్ విషయంలో రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 36 కట్స్ చెప్పారు. ఒక తెలుగు మూవీకి ఇన్ని కట్స్ చెప్పడం ఇదే మొదటిసారి. అలా ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది.

పొన్నియన్ సెల్వన్2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథాంశంతో విజువల్ వండర్ గా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.

ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను – జాన్వీ కపూర్
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాంవీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ మార్చి 23 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రివాల్వర్ రీటా తో అలరించనున్నారు. హీరో నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను లోకల్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వారిద్దరూ జంటగా దసరా మూవీ తో ప్రేక్షకులను…

ఇంటర్నేషనల్ సెన్సేషన్ కు ఏడాది
ఒక లెజెండరీ డైరెక్టర్, ఇద్దరు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మరి ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఎంత ఆసక్తికరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులోనూ ఎన్ని అంచనాలు ఉంటాయో కూడా తెలిసిందే. మరి అలాంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పటికే బాహుబలి సినిమా సంచలనం సృష్టించండంతో నెక్ట్స్ రాజమౌళి నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అందరూ. అలాంటి తరుణంలోనే జస్ట్ ఒక ఫొటో రిలీజ్ చేసి ఆ ఒక్క ఫొటోతోనే సినిమాపై హైప్ పెంచేశారు.

ప్రారంభం అయిన దసరా మూవీ బుకింగ్స్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది
చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండ వంటి మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వచ్చి ప్రేక్షకుల మనస్సులను హత్తుకున్నారు. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఇలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలను చూస్తూ ఇలాంటి సినిమాలు తీసే మేకర్స్ కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.

రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవి తేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వచ్చిన అప్ డేట్లు ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. రావణాసుర థీమ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతంచేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాదు రవితేజ మరో హిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక ఈ అంచనాల మధ్య ట్రైలర్ ను కూడా సిద్దం చేస్తున్నారు…

ఉగాది బెస్ట్ యాక్టర్ గా బింబిసార కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. ఈ మూవీ లో త్రిగర్తల రాజ్యాధినేత బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారుబింబిసార మూవీ మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.