
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 125


మొదలైన నితిన్-రష్మిక మూవీ

నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా భయం

త్వరలో PS 2 మూవీ ట్రైలర్

HIT 3 మూవీ పై హీరో నాని స్పందన

పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ ..

ఏప్రిల్ లో బిజీగా పవన్

ఉత్తమ చిత్రం గా నంది అవార్డ్ అందుకున్న బలగం

అజిత్ తండ్రి కన్నుమూత

సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్

విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్ డేట్

రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే CDP
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.
విరూపాక్ష-నచ్చావులే మెలోడి సాంగ్ రిలీజ్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఏప్రిల్ 21, 2023 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ అలానే పలు వీడియోలు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేశారు. నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే. నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలు చూశాకే సాగే ఈ మెలోడియస్ సాంగ్ ను కార్తీక్ ఆలపించాడు. ఇక పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. ఇక ఈపాట…

మొదలైన నితిన్-రష్మిక మూవీ
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రెండు రోజుల క్రితం నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సూపర్ హిట్ కాంబినేషన్ లో రెండవ చిత్రాన్ని చాలా ఫన్నీగా అనౌన్స్ చేశారు.

నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా భయం
వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. అందుకే వరుసగా హిట్లను అందుకుంటు కెరీర్ లో దూసుకుపోతున్నాడు. గత ఏడాది మేజర్, హిట్ 2 అంటూ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అడివి శేష్. రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి.

త్వరలో PS 2 మూవీ ట్రైలర్
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, జయరామ్, ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

HIT 3 మూవీ పై హీరో నాని స్పందన
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

పవన్-సాయి తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో పవన్ కళ్యాణ్ -సాయి దరమ్ తేజ్ ది కూడా ఒకటి. ఫైనల్ గా ఈ కాంబినేషన్ నుండి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో పవన్-సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ సముద్రఖని ఈసినిమాలో నటించి, దర్శకత్వంలో వహించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ కు కూడా ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈమధ్యనే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టారు. పవన్ కూడా కొంత వరకూ తన పోర్షన్స్ ను కంప్లీట్ చేశాడు.

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ ..
న్యాచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రచార చిత్రాల వల్ల ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సోలో గా రిలీజ్ అవుతుండడం కూడా సినిమాకు కలిసిరానుంది. దాంతో మొదటి రోజు ఈసినిమాతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నాడు. గత కొన్ని రోజులుగా సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ ఇతర భాషల్లో కూడా బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

ధమ్కీ రెండో రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది
ఫలక్ నుమా దాస్ తరువాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి డైరెక్ట్ చేసిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఉగాది రోజున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టి విశ్వక్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను ఇవ్వగా రెండో రోజు కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. రెండో రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలో 2కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది.

ఏప్రిల్ లో బిజీగా పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు పాలిటిక్స్ ను.. ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా వరుసగా పలు సినిమాలను మాత్రం లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖనితో సినిమా ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉన్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్స్ పైకి తీసుకెళుతూ.. టైమ్ ఉన్నప్పుడు ఆసినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవన్.

ఫార్స్ ఫిల్మ్స్ ఎల్ ఎల్ సి కి సలార్ మూవీ ఓవర్సీస్ రైట్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు…

ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ కు బొమ్మ డ్యాన్స్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మార్చి 12, 2023 న జరిగిన ఆస్కార్ అవార్డు వేడుకలో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది.

ఉత్తమ చిత్రం గా నంది అవార్డ్ అందుకున్న బలగం
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కోటిన్నర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బలగం సినిమా అద్భుత కలెక్షన్స్ తో నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో…

అజిత్ తండ్రి కన్నుమూత
ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం చూశాం. గత ఏడాది అయితే లెజెండరీ నటీనటులు సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటసార్వభౌముడు సత్యనారాయణ ఇక ఈ ఏడాది అలనాటి అందాల తార జమున ఇంకా డైరెక్టర్ విశ్వనాథ్ ఇలా ఎంతోమందిని కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో తండ్రి కన్నుమూశారు. తమిళ స్టార్ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ ఈరోజు చెన్నై లో తన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులు కూడా…

యూఎస్ బాక్సాఫీస్ కు విశ్వక్ ధమ్కీ
ఈమధ్య యంగ్ హీరోలు హీరోలుగా మాత్రమే కాదు డైరెక్టర్లుగా, రచయితలుగా కూడా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అలాంటి వారిలో ముందుంటాడు విశ్వక్ సేన్. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా తన సత్తా చూపిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరోసారి ధమ్కీ తో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ధమ్కీ. ఈసినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను…

సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా లో తన , తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ మహేష్ బాబు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఓటీటీ లోకి వచ్చేసిన బలగం
ఎప్పుడూ కమర్షియల్ ఫిలింసే కాదు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలను కూడా మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అందుకు రీసెంట్ వచ్చిన బలగం సినిమా కూడా ఉదాహరణగా చెప్పొచ్చు. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. కథా బలం ఉన్న సినిమా బలగం అని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, అప్యాయతలను చక్కగా చూపించారు డైరెక్టర్ వేణు. ఎమోషన్స్ ను బాగా చూపించడంతో అందరికీ కనెక్ట్ అయింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. సెలబ్రిటీలు సైతం సినిమాను చూసి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…

రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి షాక్
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ,రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రంగమార్తాండ. అమ్మానాన్నల కథతో తెరకెక్కిన ఈచిత్రం ఉగాది రోజున విడుదలై పాజిటివ్ రివ్యూస్ మరియు పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రంలో లెజండరీ కమెడియన్, బ్రహ్మనందం కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. చక్రపాణి అనే పాత్రలో బ్రహ్మనందం , ప్రకాష్ రాజ్ కు స్నేహితుడు గా కనిపించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇప్పటివరకు కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మనందం ,రంగమార్తాండలో ఎమోషనల్ పాత్రలో నటించి ప్రేక్షకుల చేత కన్నీళ్లు…

విరూపాక్ష ఫస్ట్ సింగిల్ అప్ డేట్
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి 'నచ్చావులే నచ్చావులే' అంటూ సాగే పాటను రిలీజ్ చేయనున్నట్టు…