కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ప్రారంభం అయిన దసరా మూవీ బుకింగ్స్

Dasara Movie Bookings Open Now

ప్రారంభం అయిన దసరా మూవీ బుకింగ్స్

Dasara Movie Bookings Now Open

Dasara Movie Bookings Open Now

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా మూవీ కి ఆల్రెడీ యూఎస్ లో అయితే ఎప్పుడో బుకింగ్స్ మొదలయ్యాయి.ఇప్పుడు ఇండియాలో మరియు తెలుగు స్టేట్స్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక మిగతా కీలక ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.హీరో నాని , కీర్తి జంటగా సూపర్ హిట్ నేను లోకల్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయంతెలిసిందే . దసరా మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్