టాకీ పూర్తి చేసిన పవన్

Pawan Kalyan Completed Talkie Part His Upcoming Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. వాటిని ఒక్కొక్కటిగా పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యనే సముద్రఖని సినిమాను ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఈసినిమా అలా ప్రకటించారో లేదో వెంటనే షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. అంతేకాదు పవన్ కూడా ఈసినిమా కోసం డేట్లు ఫిక్స్ చేసి షూటింగ్ లో వెంటనే పాల్గొన్నాడు. ఇక పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తవుతుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా పవన్ షూట్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ టాకీ పార్ట్ పూర్తయిందని డైరెక్టర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీంతో పవన్ ఇంత ఫాస్ట్ గా షూటింగ్ పూర్తిచేయడంతో ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను జులై 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఇది కాక పవన్ కళ్యాణ్ చేతిలో ఇంకా చాలా సినిమాలు వున్నాయి. క్రిష్దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీరమల్లు’, హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, అలాగే దర్శకుడు సుజిత్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =