2024 సంక్రాంతి కానుకగా #SSMB 28

#SSMB28 Movie Release Date Locked

శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా #SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్నఈ మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ ని సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు సరికొత్త మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు.కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మహేష్ బాబు సినిమాలకు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. మహేష్ బాబు నటించిన ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం అల.. వైకుంఠపురములో.. మూవీ సైతం 2020 సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. అసలే హ్యాట్రిక్ కాంబినేషన్, అందులోనూ సంక్రాంతి సీజన్ కావడంతో #SSMB 28 మూవీ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =