కట్స్ విషయంలో రికార్డు సృష్టించిన దసరా

Dasara Movie Gets Huge Censor Cuts

నాని నటించిన పాన్ ఇండియా మూవీ, దసరా విడుదలకు సిద్దమవుతుంది. ఆల్రెడీ టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈసినిమా సెన్సార్ విషయంలో రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 36 కట్స్ చెప్పారు. ఒక తెలుగు మూవీకి ఇన్ని కట్స్ చెప్పడం ఇదే మొదటిసారి. అలా ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే ఈచిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. 2గంటల 39 నిమిషాల నిడివితో ఈసినిమా ప్రేక్షకులముందుకు రానుంది. అయితే దసరా కు సెన్సార్ సభ్యులనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీ గా వుంది. అందులో భాగంగా ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే ఈవెంట్ వేదిక మారింది. నిన్న ఈ వేడుక అనంతపూర్ లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతుందని ప్రకటించారు కానీ అనివార్యకారణాల వల్ల అక్కడి నుండి షిఫ్ట్ చేశారు. ఈనెల 26నే అనంతపూర్ లోని పివికెకె ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగనుందని ఈరోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , టీజర్ , ట్రైలర్, సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేయగా విడుదలవుతున్న మూవీ పోస్టర్స్ కూడా ఆ అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. మొత్తాన్ని భారీ లెవల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 30న ఈసినిమా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − ten =