విశ్వక్ సేన్ ,దాస్ కా ధమ్కీ వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీ గా కలెక్షన్స్ ను రాబడుతూ బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. నిన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ అదరగొడుతుంది. ఇప్పటివరకు అక్కడ 250k గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా 3రోజుల్లో ధమ్కీ, ప్రపంచ వ్యాప్తంగా 15కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. మరో కోటి రూపాయల షేర్ వస్తే చాలు మూవీ బ్రేక్ ఈవెన్ ను చేరుకున్నట్లే. ఈరోజుతో ఆమార్క్ ను చేరుకోనుంది. ఇక కేవలం మూడు రోజుల్లోనే ధమ్కీ ,విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో విశ్వక్, డ్యూయెల్ రోల్ లో కనిపించగా నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ ,రోహిణి ,అక్షరా గౌడ ,కీలకపాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందే పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయడంలో విశ్వక్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ధమ్కీ, విశ్వక్ కు సాలిడ్ హిట్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత విశ్వక్ ,గామి తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్, రవితేజ ముళ్ళపూడి డైరెక్షన్ లో తన 10వ చిత్రంలో నటిస్తున్నాడు. ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: