స్టార్ హీరోయిన్ సమంత బ్యాక్ టు ఫామ్ అయింది. గత ఏడాది సమంతకు మయోసైటిస్ ఎటాక్ అయ్యింది. అప్పటినుంచి పోరాటం చేస్తున్న సామ్ ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తుంది. సినిమాల షూటింగ్ లలో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను తీసుకొని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ డేట్ మారింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది సమంత. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన హెల్త్ కండీషన్ పై అప్ డేట్ ఇచ్చింది. తాను ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్నానని.. ప్రస్తుతం హెల్త్ బాగానే ఉంది.. ఇప్పుడిప్పుడే బయట తిరగగలుగుతున్నా అంటూ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ వండర్‌గా త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా విడుదలవుతుంది. ఏప్రిల్ 14న 2D, 3D వెర్షన్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: