చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండ వంటి మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వచ్చి ప్రేక్షకుల మనస్సులను హత్తుకున్నారు. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఇలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలను చూస్తూ ఇలాంటి సినిమాలు తీసే మేకర్స్ కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను చూసిన వారందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ లో స్పందిస్తూ చిత్రయూనిట్ ను ప్రశంసించారు. రంగమార్తాండ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇది చాలా మంచి చిత్రం. ప్రతి ఆర్టిస్ట్‌కీ తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం త్రివేణీ సంగగమంలా అనిపించింది. కృష్ణవంశీలాంటి ఒక క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్ రాజ్వంటి జాతీయ ఉత్తమనటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక వారి పనితనం ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇంత ఇన్టెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రని చేయటం ఇదే తొలిసారి. సెకండాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్‌కి, రమ్యకృష్ణకి చిత్రయూనిట్ అంందరికీ అభినందనలు అన్నారు మెగాస్టార్.
Kudos to #Rangamarthanda 👏👏@director_kv @prakashraaj #Brahmanandam @meramyakrishnan pic.twitter.com/spjo5FZlWw
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2023
కాగా ఈసినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: