PKSDT మూవీ కి జూలై సెంటిమెంట్

July Sentiment for #PKSDT Movie

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై సముద్ర ఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయితేజ హీరోలుగా తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వినోదయ సితం మూవీ తెలుగు రీమేక్ జూలై 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో కేతిక శర్మ , రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు , స్క్రీన్ ప్లే అందించడం విశేషం .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెహ హీరోలు నటించిన పలు సినిమాలు జూలై నెలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవిఇంద్ర , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు , తొలిప్రేమ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధీర , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా మూవీస్ జూలై నెల లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ , సాయితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ జూలై నెలలో రిలీజ్ కానుండటం తో మెగా అభిమానులు ఈ సినిమా కూడా జూలై సెంటిమెంట్ తో ఘనవిజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =