#RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్

Ram Charan And Shankar Movie Titled as Game Changer

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ప్రభుదేవా కొరియోగ్రఫీ లో రామ్ చరణ్, కియారాలపై ఓ పాట షూట్ కంప్లీట్ అయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా #RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్ గా టైటిల్ లోగోను మేకర్స్ రిలీజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మేకర్స్ ఒక పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేయడం తో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా గేమ్ ఛేంజర్ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eleven =