NTR 30 కోసం హాలీవుడ్ యాక్షన్ కోరియోగ్రాఫర్

Hollywood Action Choreographer Kenny Bates Joins In Ntr30

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా ఫైనల్ గా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. అందులోనూ జనతా గ్యారేజ్ లాంటి హిట్ తరువాత కొరటాల దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే కొరటాల కూడా ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రేంజ్ లోనే కథను కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ సినిమా కోసం షూటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమాలో భాగం అయినట్లు చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. కెన్నీ బేట్స్‌కు సాబు సిరిల్ సన్నివేశాన్ని వివ‌రిస్తుంటే పక్కన కొరటాల శివ ఇంకా చిత్రయూనిట్ ఉన్నారు.

కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఇంకా ఈసినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =