ఒక లెజెండరీ డైరెక్టర్, ఇద్దరు స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మరి ఇలాంటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఎంత ఆసక్తికరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందులోనూ ఎన్ని అంచనాలు ఉంటాయో కూడా తెలిసిందే. మరి అలాంటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పటికే బాహుబలి సినిమా సంచలనం సృష్టించండంతో నెక్ట్స్ రాజమౌళి నుండి ఎలాంటి సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అందరూ. అలాంటి తరుణంలోనే జస్ట్ ఒక ఫొటో రిలీజ్ చేసి ఆ ఒక్క ఫొటోతోనే సినిమాపై హైప్ పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరికోసం ఎలాంటి కథతో రావాలని చూస్తున్న తరుణంలో చరిత్రలో కలవని ఇద్దరు పవర్ ఫుల్ స్వాతంత్య్ర సమరయోధులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని.. దానికోసం కథను సిద్దం చేశాడు. ఇక ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా రూపొందించాడు రాజమౌళి. వాటర్, ఫైర్ అంటూ రామ్ చరణ్ లోని ఫైర్ ను అలానే ఎన్టీఆర్ లోని అమాయమైన కోణాన్ని చూపిస్తూ.. దానితోపాటు స్నేహం, ఎమోషన్స్ ను కూడా ఎగ్జిక్యూట్ చేసి అందరినీ ఆకర్షించేలా చేశాడు
ఇక ఈసినిమా మొదలై రిలీజ్ అవ్వడానికి నాలుగేళ్లు పట్టింది. రెండేళ్లలో సినిమాను రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాడు రాజమౌళి కానీ అది అవ్వలేదు.. ఈ గ్యాప్ లో కోవిడ్ రావడంతో ఇంకా ఆలస్యమవుతూ వచ్చింది. అయినా కూడా ఈసినిమాపై ఉన్న నమ్మకంతో వెయిట్ చేశారు ప్రేక్షకులు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలని ఎదుర్కొని ఫైనల్ గా గత ఏడాది మార్చి 25న రిలీజ్ అయింది. ప్రేక్షకుల నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా అలరించింది. అందుకే రిలీజ్ అయి నేటితో ఏడాది పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా పేరు వినిపిస్తూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్టయిన ఈ సినిమా, విదేశాల్లో కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంది. అంతేకాదు ఎంతోమంది అంతర్జాతీయ డైరెక్టర్ల ప్రశంసలు సైతం అందుకొని ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుంది. రీసెంట్ ఆస్కార్ సైతం అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు ఆర్ఆర్ఆర్ టీం. మరి ఏడాది అవుతున్నా కూడా ఈసినిమా జపాన్ లాంటి దేశాల్లో ఇంకా నడుస్తూనే ఉండటం విశేషం. మరి ముందు ముందు కూడా రాజమౌళి ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసి తెలుగు సినీ ఖ్యాతిని పెంచాలని కోరుకుందాం..
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: