బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సోషల్ మీడియా లో కూడా అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ సంఖ్యా అధికమే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కుతున్న పుష్ప :ది రూల్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పుష్ప 2 మూవీ వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే బ్యాంకాక్ అడవుల్లో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారనీ, దాదాపు నెల రోజులకు పైగా అక్కడే షూటింగ్ ఉంటుందనీ సమాచారం.స్టైలిష్ స్టార్ టర్న్ డ్ ఐకాన్ స్టార్ యూనిక్ లుక్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. లాంగ్ కర్లీ బ్రౌన్ హెయిర్.. గుబురు గడ్డం కోర మీసం.. బ్లాక్ అండ్ వైట్ పూల చొక్కా తో ముంబై ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ న్యూలుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు.ఈసారి పుష్పరాజ్ రగ్డ్ లుక్ కాకుండా.. కాస్త స్టైలీష్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో పుష్ప 2పై మరింత క్యూరియాసిటీ పెరిగింది.ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుసమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: