ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను – జాన్వీ కపూర్

Janhvi Kapoor About Working With Jr NTR For #NTR30

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాంవీ కపూర్ జంటగా పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న #NTR30 మూవీ మార్చి 23 వ తేదీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. #NTR30 మూవీ తెలుగు తో పాటు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో 2024 ఏప్రిల్ 5 వ తేదీ రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరోయిన్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా చాలా బాగుండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#NTR30 మూవీ ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న జాన్వీ కపూర్ ఒక ఈవెంట్ లో భాగంగా ఈ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. జాన్వీ మాట్లాడుతూ .. తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న ఈ మూవీ ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందనీ ఈసినిమా అవకాశం రాగానే తన ఆనందానికి అవధులు లేవనీ , ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న షూటింగ్ అతి త్వరలో మొదలు కానుండడంతో తన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకున్నాననీ ,కొరటాల శివ అద్భుతమైన స్టోరీ చెప్పారనీ , తప్పకుండా ఈ పాన్ ఇండియన్ మూవీ హీరోయిన్ గా తనకు పెద్ద బ్రేక్ ని అందిస్తుందని ఆశాభావంతో ఉన్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.