థమన్ ఎస్ బ్యాటింగ్ తో ఫైనల్స్ కు చేరుకున్న తెలుగు వారియర్స్

Thaman's Super Innings Takes Telugu Warriors To Finals

సినిమా, క్రికెట్.. ఈ రెండు రంగాలకి దేశంలో ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ రెండు కలిసి ఒకే ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తే.. అదే సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ . కొంతకాలంగా జరగకుండా ఆగిపోయిన ఈ లీగ్ మ్యాచ్స్ ఇటీవలే మళ్ళీ తిరిగి మొదలయ్యాయి. ఫిబ్రవరి 18న మొదలైన ఈ CCL మ్యాచ్స్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. మొత్తం 8 టీమ్స్ 16 మ్యాచ్‌లు జరగగా.. వాటిలో భోజపురి దబాంగ్స్ , ముంబై హీరోస్ , తెలుగు వారియర్స్ ), కర్ణాటక బుల్ డోజర్స్ టీమ్స్ సెమీ ఫైనల్స్ కి చేరుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భోజపురి దబాంగ్స్ టీమ్ ముంబై హీరోస్ టీమ్ పై గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ తరువాత తెలుగు వారియర్స్ అండ్ కర్ణాటక బుల్ డోజర్స్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచి అఖిల్ సేన.. బౌలింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. ఇక బ్యాటింగ్ దిగిన కర్ణాటక 5 వికెట్స్ కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ తరువాత తెలుగు వారియర్స్ బ్యాటింగ్ కి దిగి మొదటి ఇన్నింగ్స్ ని 5 వికెట్స్ కోల్పోయి 95 పరుగులతో ముగించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కర్ణాటక టీం మళ్ళీ 5 వికెట్స్ కోల్పోయి 98 పరుగులు చేసింది. దీంతో తెలుగు వారియర్స్ మొత్తం మీద 103 పరుగులు టార్గెట్ ఛేదించాల్సి ఉంది. చివరి ఓవర్ వచ్చేపాటికి 6 వికెట్లు కోల్పోయి గ్రీస్ లో థమన్, ప్రిన్స్ ఉన్నారు.6 బంతుల్లో 8 పరుగులు చేయాలన్న సమయంలో.. థమన్ స్ట్రైకింగ్ లో ఉన్నారు. ఓవర్ లో మొదటి బంతినే బౌండరీ (4) పంపించేశారు ఆ తరువాత ఒక సింగల్ తీసి ప్రిన్స్ స్ట్రైక్ ఇచ్చారు .ప్రిన్స్ కూడా ఒక సింగల్ తీసి మళ్ళీ థమన్ కి స్ట్రైక్ ఇచ్చారు. ఇక 3 బంతుల్లో 2 పరుగులు తీయాలి అన్న సమయంలో.. థమన్ 4 కొట్టి తెలుగు వారియర్స్ ని ఫైనల్స్ కి తీసుకువెళ్లారు . మొత్తం 15 బంతుల్లో 25 పరుగులు చేసి నిన్నటి మ్యాచ్ లో థమన్ హీరోగా నిలిచారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =