పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేపషన్ లో వస్తున్న సినిమా సలార్. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా నుండి అప్పుడప్పుడు పలు పోస్టర్లు తప్పా.. పెద్దగా అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు అభిమానులు కూడా అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దాదాపు షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్టే. మరికొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా షూట్ కు సంబంధించిన ఒక పిక్ వైరల్ గా మారింది. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న భువన్ గౌడ సలార్ షూట్ పిక్ ని షేర్ చేశారు. ఆ పిక్ లో ఓ క్రేన్ తో భారీ ఫైర్ లైటింగ్ తో కూడిన ఎక్విప్మెంట్ కనిపిస్తుంది. దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: