నితిన్ కల్ట్ మూవీ రీ రిలీజ్

Nithiin's Cult Classic Movie Gets A Re-Release Date

హీరోల బర్త్ డే ల సందర్భంగా వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ గా మారింది. కేవలం బర్త్ డే అనే కాదు స్పెషల్ డే లు వున్నా కూడా ఇది రిపీట్ అవుతుంది. అందులో భాగంగా జల్సా , ఖుషి ,గబ్బర్ సింగ్,ఒక్కడు, పోకిరి,బిల్లా, వర్షం ఇలా మరి కొన్ని సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 25,26న ఆరెంజ్ రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యంగ్ హీరో నితిన్ నటించిన ఇష్క్ రీ రిలీజ్ అవుతుంది. ఈనెల 30న నితిన్, తన బర్త్ డే జరుపుకోనుండగా అంతకుముందు రోజు 29న ఈ సినిమా విడుదలకానుంది. వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న టైం లో ఇష్క్ సినిమా, నితిన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించి సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. లవ్ స్టోరీ నేపథ్యంలో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈసినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. నితిన్ సొంత ప్రొడక్షన్ ,శ్రేష్ఠ్ మూవీస్ ఈసినిమాను నిర్మించింది.

ఇక నితిన్ ,మాచర్ల నియోజకవర్గం తరువాత ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్టన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమానే కాకుండా నితిన్ రీసెంట్ గా మరో మూవీ కూడా స్టార్ట్ చేశాడు. ఈచిత్రాన్ని వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈసినిమాలో నితిన్ కు జంటగా రష్మిక మందన్న నటిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇంతకుముందు నితిన్ ,రష్మిక , వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయ్యింది. మరి ఈరెండో చిత్రం వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − one =