రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Ravi Teja Ravanasura Movie Trailer Release Date Fixed

రీసెంట్ గా ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవి తేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వచ్చిన అప్ డేట్లు ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచాయి. రావణాసుర థీమ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతంచేసుకుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అంతేకాదు రవితేజ మరో హిట్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక ఈ అంచనాల మధ్య ట్రైలర్ ను కూడా సిద్దం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మార్చి 28వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =