మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా మొదటి పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథాంశంతో విజువల్ వండర్ గా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తమిళ్ లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సెకండ్ పార్ట్ ను ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా షురూ చేశారు మేకర్స్. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆగనందే అంటు వచ్చిన ఈపాట ఇప్పటికే ఆకట్టుకుంది.
తాజాగా విక్రమ్ కు సంబంధించిన లుక్ ను కూడా మరోసారి రిలీజ్ చేశారు. దీనితో పాటు ట్రైలర్ అప్ డేట్ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్ ను మార్చి 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: