
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 214


50రోజుల "అఖండ"

'సెల్ఫిష్' కానున్న రౌడీ బాయ్..!

బిజీ బిజీ గా రకుల్.. 2022 లో 7 సినిమాలు..!

'ది ఘోస్ట్'.. కాజల్ ప్లేస్ లో సోనాల్..?

'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్

మెటాలిక్ డ్రెస్ లో క్యూట్ గా పాయల్ రాజ్ పుత్

హీరో నిఖిల్ సంక్రాంతి సందడి

ట్రెడిషినల్ డ్రెస్ లో అందంగా నిధి అగర్వాల్

నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్..!

కొత్త "హీరో" పై రామ్ చరణ్ ప్రశంసలు

అసలైన 'బంగార్రాజు' మా నాన్నగారు

కృతి శెట్టి మనసులో మాట

ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ కు నాగార్జున థ్యాంక్స్

రౌడీ హీరో పెట్ డాగ్ ఫన్నీ వీడియో..!

మరోసారి నెగిటివ్ షేడ్ లో నాని..?

సైలెంట్ గా హిట్స్ తో దూసుకుపోతున్న 'నాగ చైతన్య'

"అల .. వైకుంఠపురములో .. " హిందీ వెర్షన్ టీజర్ రిలీజ్
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల.. వైకుంఠపురములో”మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే “అల.. వైకుంఠపురములో.. “మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

'రెబల్ స్టార్' కి రాధేశ్యామ్ టీమ్ బర్త్ డే విషెస్..!
ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్'. 1960ల కాలం నాటి ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో క్లాస్ లుక్ లో కనిపించనుండగా.. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

50రోజుల "అఖండ"
హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య ల స్క్రీన్ కెమిస్ట్రీ అలరించింది.

'సెల్ఫిష్' కానున్న రౌడీ బాయ్..!
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు కుర్ర హీరో ఆశిష్ రెడ్డి. దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆశిష్ రెడ్డి మంచి ప్రశంసలు దక్కించుకున్నాడు. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఆశిష్ రెడ్డికి ఉన్నాయంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని ఆశిష్ రెడ్డి చెప్పినట్టు.. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

బిజీ బిజీ గా రకుల్.. 2022 లో 7 సినిమాలు..!
"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.

'ది ఘోస్ట్'.. కాజల్ ప్లేస్ లో సోనాల్..?
ఈ ఏడాది మంచి హిట్ తో తన ఖాతాను తెరిచాడు కింగ్ నాగార్జున. నిజానికి నాగార్జునకు కూడా మంచి హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది. సోగ్గాడే చిన్న నాయన సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ కొట్టిన సినిమా మరొకటి లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత అదే సినిమాను సీక్వెల్ తీసి బంగార్రాజుతో సూపర్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ బంగార్రాజుతో బిజీగా ఉన్న నాగ్ ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే నాగ్ హిందిలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.

'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్
తమిళ హీరోల సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. పదవి, అధికారం కోసం సామాన్యులను అంతం చేయడానికి చూస్తున్న రాజకీయ నాయకులను ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంపై ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు శరవణన్.

మెటాలిక్ డ్రెస్ లో క్యూట్ గా పాయల్ రాజ్ పుత్
సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో పాయల్ ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం “కిరాతక ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఏంజెల్ “ "గోల్ మాల్ " తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. పాయల్ ఇప్పుడు “హెడ్ బుష్ “మూవీ తో శాండల్ వుడ్ లో అడుగుపెడుతున్నారు.

హీరో నిఖిల్ సంక్రాంతి సందడి
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన "18 పేజెస్"మూవీ ఫిబ్రవరి 18 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "కార్తికేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 "మూవీ సెట్స్ పైన ఉంది. ఐ డి ఎంటర్ టైన్ మెంట్స్ , రెడ్ సినిమాస్ బ్యానర్స్ పై గారి బి హెచ్ దర్శకత్వంలో నిఖిల్ , ఐశ్వర్య మీనన్ జంటగా తెరకెక్కే "నిఖిల్ 19"మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే.

ట్రెడిషినల్ డ్రెస్ లో అందంగా నిధి అగర్వాల్
“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు.నిధి ప్రస్తుతం “హరిహర వీరమల్లు” (తెలుగు ) , ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.“భూమి “, “ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి కథానాయికగా తెరకెక్కిన “హీరో “మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్..!
కొత్త ఏడాది కొత్త హీరోలకు మాత్రం బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఆసినిమాల్లో వచ్చిన ఒక సినిమానే రౌడీ బాయ్స్. ఈసినిమాతోనే ఆశిష్ రెడ్డి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. దిల్ రాజు ఫ్యామిలీ నుండి వస్తున్న హీరో కావడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉండగా.. ఆ అంచనాలను ఆశిష్ రెడ్డి నిలబెట్టాడనే చెప్పొచ్చు. మొదటి సినిమా అయినా కూడా తన నటనతో, డాన్స్ తో, యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఆశిష్ కు ఉన్నాయన్న ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు.

కొత్త "హీరో" పై రామ్ చరణ్ ప్రశంసలు
అమర రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు , మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా , నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన "హీరో "మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి మంచి టాక్‌తో విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అశోక్ తన డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.అశోక్ , నిధి ల స్క్రీన్ కెమిస్ట్రీ అలరించింది.

అసలైన 'బంగార్రాజు' మా నాన్నగారు
ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి. పెద్ద సినిమాలన్నీ పోటీ నుండి తప్పుకోవడంతో అనుకోకుండా చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇక వీటి మధ్యలో విడుదలైంది బంగార్రాజు. తమ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని తేల్చి చెప్పి మరీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు కింగ్ నాగార్జున. ఇక నాగార్జున పెట్టుకున్న నమ్మకమే నిజం చేశారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది.

"ఖిలాడి" మూవీ న్యూ పోస్టర్స్ రిలీజ్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వరుణ్ బర్త్ డే.. 'ఎఫ్ 3' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్ 2. ' ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అన్న ట్యాగ్ లైన్ తో 2019లో సంక్రాంతికి వచ్చిన ఈసినిమా అందరికీ ఫన్ మాత్రమే అందించి సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక దాంతో ఈసినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు అప్పుడే చెప్పేశారు చిత్రయూనిట్. అన్నట్టుగానే ఈసినిమా సీక్వెల్ ను ఎఫ్ 3 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఇక అన్నీ బాగుంటే ఈసీక్వెల్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది. కానీ కరోనా వల్ల.. సినిమా పనులు ఇంకా అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ను వాయిదా వేయక తప్పలేదు.

కృతి శెట్టి మనసులో మాట
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.“

ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ కు నాగార్జున థ్యాంక్స్
జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “బంగార్రాజు ” మూవీ జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. “బంగార్రాజు “మూవీ విశేష ప్రేక్షకాదరణతో భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా “బంగార్రాజు “మూవీ సక్సెస్ మీట్ రాజమండ్రి లో జరిగింది.

రౌడీ హీరో పెట్ డాగ్ ఫన్నీ వీడియో..!
మన సెలబ్రిటీలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తమ పెట్స్ తో మాత్రం కాస్త టైమ్ ను స్పెండ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ పైట్ డాగ్స్ పై తమకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తమ పోస్ట్ ల ద్వారా తెలియచేస్తూనే ఉంటారు. ఆ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ హీరో కూడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ కూడా తన పెట్ డాగ్ కు సంబంధించిన ఫొటోలను కానీ వీడియోలను కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన ఇన్ట్సా ద్వారా తన స్ట్రామ్ కు సంబంధించి ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ ప్రైవేట్ జట్ లో ప్రయాణంలో ఉన్న తమ్ముడు ఆనంద్…

మరోసారి నెగిటివ్ షేడ్ లో నాని..?
ఈమధ్య హీరోలు హీరోల్లాగ మాత్రమే కాదు కాస్త నెగిటివ్ షేడ్ లో చేయడానికి కూడా ఏ మాత్రం ఆలోచించట్లేదు. ఒక రకంగా కొంతమందికి ఆ రోల్స్ కూడా బాగానే కలిసొస్తున్నాయి. అందుకే అన్ని రకాల ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇక దీనిలో భాగంగానే నాని మరోసారి నెగిటివ్ షేడ్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. నాని నెగిటివ్ షేడ్ లో ఇప్పటికే జెంటిల్‌మన్, వి సినిమాల్లో నటించాడు. అంతేకాదు ఆ పాత్రల్లో నాని నటనకు గాను మంచి ప్రశంసలు దక్కాయి.

సైలెంట్ గా హిట్స్ తో దూసుకుపోతున్న 'నాగ చైతన్య'
తెలుగు తెరపై ఎంట్రీ ఇవ్వాలని.. స్టార్ హీరోగా ఎదగాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే వారిలో కొంతమంది సక్సెస్ అవుతారు.. కొంతమంది ఆ అంచనాలను తాకలేరు. అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఈజీ అని.. అలానే అవకాశాలు అవే వస్తాయి అన్న అపోహ కూడా ఎప్పటినుండో ఉంది. కానీ నిజానికి ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుందేమో కానీ ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకొని అవకాశాలు దక్కించుకోవాలంటే మాత్రం అంత ఈజీ కాదు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా చూశాం. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి సక్సెస్ అవ్వలేని హీరోలు ఎంతో మంది ఉన్నారు.. అలానే బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా తమ కష్టంతో, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి…